Shruti Haasan : ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన శృతి హాసన్

Shruti Haasan: కమల్ హాసన్ వారసురాలిగా అడుగు పెట్టిన అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్… కెరీర్ ప్రారంభంలో ఒక్క హిట్ రావడానికే చాలా పట్టింది. అంతగా అవకాశాలు రాని సమయంలోనే పవన్ కల్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించి ఎక్కడ లేని స్టార్ ఇమేజ్ స్థాయిని సొంతం చేసుకుంది ఈ భామ. ఇక అప్పటి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి ఆమెకు రాలేదనే చెప్పాలి.

కాగా ఇటీవలి కాలంలో కోవిడ్ బారిన పడిన శృతి హాసన్, కరోనా నుంచి కొలుకున్నా కూడా ఆరోగ్యం అంతగా సహకరించడం లేదని ఆమె పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అయ్యింది. కరోనా వచ్చినపుడు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని చాలా మంది సెలబ్రిటీలు ఆకాంక్షించారు. గుర్తు పట్టనంతగా మారిపోయిన ఆమె ముఖాన్ని చూసి ఎంతో మంది ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆ సమయంలో ఆమె తన ప్రియుడితో ఉన్న పిక్ ఒకటి వైరల్ అవడంతో ఇప్పుడు కూడా ఈ పనులేంటి అని ఈసడించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.

ఐతే తాజాగా శృతి, తన ప్రియుడు శాంతన్ తో కలిసి చేతిలో చేయి వేసుకొని, ఎయిర్ పోర్ట్ లో నడుచుకుంటూ వెళ్లడం సంచలనంగా మారింది. శాంతన్ ఒక ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తే అయినా, శృతి కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలవడం గమనార్హం.

అయితే తాము ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నామని, ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం అని ఇటీవలే శాంతను ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ఇది తామిద్దరికీ ఒక క్రియేటివ్ జర్నీ అని, ఒకరి క్రియేటివ్ పవర్ ను మరొకరు ఫీడ్ చేసుకుంటూ ఉన్నామని ఆయన తెలిపారు. ఇకపోతే తాజాగా మెగా 154 చిత్రంతో మెగాస్టార్ సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ తార, బలయ్యతోనూ ఎన్బీకే 107 నటిస్తున్నట్టు సమాచారం.