ఒళ్ళో కూర్చోబెట్టుకొని తల నిమురుతూ ముద్దులు పెడుతున్న రష్మిక.. ఎవరికో తెలుసా?

అందాల నటి రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ శౌర్య హీరోగా నటించిన చలో సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ కన్నడ ముద్దుగుమ్మ.. విజయ్ దేవరకొండ సరసన నటించిన గీత గోవిందం సినిమా ద్వారా బాగా పాపులర్ అయ్యింది.ఆ సినిమా హిట్ అవ్వటంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకొని అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది.

ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా నటించింది. ఈ సినిమా ద్వార రష్మిక పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ పెంచుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను కూడా అందుకుంటోంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇటీవల రష్మీక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

సాధారణంగా హీరో, హీరోయిన్లు పెట్ డాగ్స్ ని పెంచుకుంటారు. షూటింగ్స్ వల్ల అలసిపోయిన వారు ప్రేమగా పెంచుకున్న పెట్స్ తో సమయం గడుపుతూ రిలాక్స్ అవుతారు. రష్మిక వద్ద కూడా ఆరా అనే పెట్ డాగ్ ఉంది. షూటింగ్ సమయంలో కూడా రష్మీక తన పెట్ ని షూటింగ్ స్పాట్ కి తీసుకెళ్తూ ఉంటుంది. షూటింగ్ గ్యాప్ లో తన పెట్ డాగ్ తో సమయం గడుపుతూ రిఫ్రెష్ అవుతుంది. ఇటీవల రష్మీక తన పెట్ డాగ్ ఆరాని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని తల నిమురుతూ.. ముద్దులు పెడుతున్న వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియోలో రష్మిక తన పట్ల చూపిస్తున్న ప్రేమకి తన పెట్ కూడా మురిసిపోయింది.