ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంతా గొప్పలు చెప్పుకునే బ్యాచ్.. నాకు అలాంటివి నచ్చవు: రాధిక ఆప్టే

ఇండస్ట్రీలో విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలబడి, ఎలాంటి పాత్రలోనైనా ఎంతో అవలీలగా నటిస్తూ బోల్డ్ పాత్రలకు, నగ్నంగా నటించడానికి అయినా ఏమాత్రం వెనకాడకుండా తన బోల్డ్ పర్ఫార్మెన్స్ తో అందరిని సందడి చేసే నటి రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగులో రక్త చరిత్ర, లయన్, లెజెండ్ వంటి చిత్రాలలో నటించారు.ప్రస్తుతం ఈమె తెలుగు తెరకు దూరమైనప్పటికీ బాలీవుడ్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.

ఇక ఈ ముద్దుగుమ్మ షూటింగ్ పరంగా ఏమాత్రం విరామం దొరికిన హాలిడే వెకేషన్ వెళ్తూ తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈమె లండన్ హాలిడే వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ తన వెకేషన్ కి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో పలువురు హీరోయిన్ల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో చాలామంది అందంగా ఉంటేనే అవకాశాలు వస్తాయని భావిస్తారు. అందుకే నిత్యం సర్జరీలు చేయించుకుంటూ అందాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు అంటూ తెలిపారు.

తనకు అలాంటివన్నీ నచ్చవని తాను కేవలం వృత్తిపరంగా మాత్రమే సినిమాలతో ప్రయాణం చేస్తానని తెలిపారు. ఇకపోతే కొందరు తన దగ్గర ఇండస్ట్రీలో కొనసాగాలంటే శరీరాకృతి ముఖ్యం కాదంటూనే సర్జరీలు చేయించుకున్న వారు కూడా ఉన్నారని ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ పలువురు తారలు గురించి కామెంట్స్ చేశారు.ఇకపోతే ఇండస్ట్రీలో చాలా మంది కాలక్షేపం కోసం కబుర్లు చెబుతూ ఎంతో గొప్పగా వారి గురించి గొప్పలు చెప్పుకుంటారని తనకు అలా గొప్పలు చెప్పుకోవడం ఏమాత్రం నచ్చదని ఈ సందర్భంగా రాధిక ఆప్టే షాకింగ్ కామెంట్ చేశారు.