Vinod Kumar: త్వరలోనే తన కొడుకుని హీరోగా పరిచయం చేయనున్న వినోద్ కుమార్..?

Vinod Kumar: సాధారణంగా హీరోల కొడుకులు, మనవళ్లు వారసులుగా ఇండస్ట్రీ లోకి రావడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది నటీనటులు వారి తల్లిదండ్రుల వారసత్వాన్ని అంది పుచ్చుకొని ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు. ఇక సీనియర్ నటుడు వినోద్ కుమార్ కూడా త్వరలోనే తన కొడుకుని హీరోగా పరిచయం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట. మొదట మౌనపోరాటం సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన వినోద్ కుమార్ అతి తక్కువ కాలంలోనే నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. వినోద్ కుమార్ నటించిన సీతారత్నం గారి అబ్బాయి, మామగారు లాంటి సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

అంతేకాకుండా ఆ సినిమాలు వినోద్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత చేరువ అయ్యేలా చేశాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అతను తన పెద్ద కొడుకు ని టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయబోతున్నట్లు తెలిపాడు. ఇప్పటికే యాక్టింగ్, మార్షల్ ఆర్ట్స్ వంటి వాటిలో శిక్షణ కూడా తీసుకుంటున్నాడని, కన్నడ ఇండస్ట్రీ నుంచి మంచి అవకాశాలు వస్తున్నప్పటికీ, మొదట తెలుగు సినిమా తోనే ఎంట్రీ ఇవ్వాలని అన్న ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా మంచి కథ దొరికితే త్వరలోనే తన కొడుకు ని పరిచయం చేయబోతున్నాను అని చెప్పుకొచ్చారు వినోద్ కుమార్.