Rashmika Mandanna: టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రష్మిక మందన్న ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో రష్మిక నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. అంతేకాకుండా రష్మిక అడుగుపెడితే ఆ సినిమా హిట్ కాయం అనే సెంటిమెంట్ గత కొంతకాలంగా కొనసాగుతోంది. దీంతో ఈమెకు తెలుగు తమిళం హిందీ అనే భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలు వస్తున్నాయి. పుష్ప 2 సినిమా తర్వాత వచ్చిన చావా సినిమా కూడా సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా సల్మాన్ ఖాన్ సరసన సికందర్ లోనూ మెరిసింది. ప్రస్తుతం నాగార్జున ధనుశ్ కీలక పాత్రలు పోషిస్తోన్న కుబేరలో కనిపించనుంది. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే రష్మిక పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు విజయ్ దేవరకొండ. ఈ జంట గతంలో చాలా సార్లు కలిసి కనిపించిన విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఆ వార్తలు ఎలాంటి నిజం లేదు అంటూ వాటిని కప్పిపుచ్చుకుంటూనే అలాంటి వార్తలను స్కిప్ చేస్తూ వస్తున్నారు.
చాలాసార్లు వీరిద్దరూ ఒకే చోట కెమెరాకంట చిక్కిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక మందన తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో శారీలో ఉన్న పిక్స్ మరింత వైరల్ కావడంతో ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఆ ఫోటోలు తీసింది.. మరెవరో కాదు.. బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ. ఈ ఫోటోలన్నీ నాకు ఇష్టమైనవి. ఈ రంగు, ప్రదేశం నాకు చీరను బహుమతిగా ఇచ్చిన అందమైన మహిళ. అంతేకాకుండా ఫోటోగ్రాఫర్ ఈ ఫోటోలోని ప్రతిదీ నా లైఫ్‌లో భర్తీ చేయలేనివీ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అయితే ఈ ఫోటోల్లో ఉన్న బ్యాగ్ గ్రౌండ్ విజయ్ దేవరకొండ ఇంటిలాగే ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఈ ఫోటోలు కచ్చితంగా విజయ్ దేవరకొండ తీసి ఉంటారని మరొకరు రాసుకొచ్చారు. గతంలో కూడా ఇలాగే చాలాసార్లు విజయ్ ఇంట్లో ఉన్న ఫోటోలు షేర్ చేసి దొరికిపోయిన రష్మిక, మరోసారి అలాగే నెటిజన్లకు చిక్కింది. తనంతట తానే ఫోటోలు లీక్ చేసి తాజాగా మరోసారి అడ్డంగా బుక్ అయ్యింది.