Allu Arjun: అల్లు అర్జున్ వ్యవహారం తెలుగు సినిమా ఇండస్ట్రీతో మిగతా సినిమా ఇండస్ట్రీలలో కూడా సంచలనం రేపిన విషయం తెలిసిందే. సంధ్యా థియేటర్ కేసులో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ అవడం, ఆయనకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం, ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు మళ్లీ అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేయడం ఇవన్నీ కూడా సంచలనంగా మారాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ తో ఒక్కసారిగా అభిమానులు, సెలబ్రిటీలు షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరుగా ఈ విషయంపై స్పందిస్తూ అల్లు అర్జున్ కు పూర్తి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ వ్యవహారంపై జగన్, నాని, అలాగే ఇంకా కొంతమంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తూనే, అల్లు అర్జున్ కి మద్దతుగా నిలిచారు. ఇది ఇలా ఉంటే తాజాగా మరో ఇద్దరు సెలబ్రిటీలు అల్లు అర్జున్ మద్దతుగా నిలుస్తూ కామెంట్స్ చేశారు. ఆ సెలబ్రిటీలు మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన. మరి ఈ వ్యవహారం పై వారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అన్న విషయానికి వస్తే.. మొదట వరుణ్ ధావన్ విషయానికి వస్తే..
అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం పై స్పందించిన వరుణ్ ధావన్.. జైపూర్ లో జరిగిన ఈవెంట్లో మాట్లాడుతూ నటుడు ఒక్కరే అన్ని విషయాలు చూసుకోలేరని, జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని, కానీ ఈ ఘటనకు ఒక్కళ్ళనే బాధ్యతలు చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు రష్మిక మందన సైతం ఈ విషయంపై స్పందిస్తూ.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నేను నమ్మలేకపోతున్నాను. ఈ ఘటన దురదృష్టకరం. హృదయాన్ని కలచి వేస్తోంది. ఒకే వ్యక్తిని నిందించడం సబబు కాదు అని రష్మిక మందన తెలిపింది.
