Actor Rajasekhar: ఆయుధం సినిమా సమయంలో హీరో రాజశేఖర్‌కి తనకు కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు వచ్చాయన్న మాటల్లో ఎలాంటి నిజమూ లేదని డైరెక్టర్ శంకర్ అన్నారు. కానీ ప్రారంభంలో షూటింగ్‌కి టైంకి వచ్చేవారన్న ఆయన, ఆ తర్వాత మాత్రం ఆయన ఏ టైంకి వస్తే ఆ టైంకి షూట్ చేయాల్సి వచ్చేదని ఆయన చెప్పారు. తాము ఏదైనా సీన్ తీద్దామనుకొని ప్లాన్ వేసుకున్నపుడు వాళ్లు వచ్చే టైంని బట్టి ఆ సీన్ క్లారిటీ ఆధారపడి ఉంటుందని శంకర్ అన్నారు. తాము ఒకవేళ ఉదయం 10 గంటలకు షూట్ అనుకుంటే, అందులో చేసే పాత్రలు మాత్రం 2 గంటలకు వస్తే వేరే విధంగా ఉంటుందని ఆయన చెప్పారు. అలా రాజశేఖర్ లేట్‌గా వచ్చిన ప్రతీసారి ఏదో ఒకటి చెప్తూ ఉండేవారని ఆయన నవ్వుతూ చెప్పారు. అంతే కాకుండా తామిద్దరూ చాలా క్లోజ్‌గా ఉండేవారమని ఆయన స్పష్టం చేశారు.
ఇక అభిప్రాయ భేదాలంటూ ఏమీ తామిద్దరి మధ్య లేవని, ఇలాంటి చిన్న చిన్న కామెడీ సంఘటనలు జరుగుతుండేవని ఆయన చెప్పారు. కానీ రాజశేఖర్ ఎప్పుడొచ్చినా షూట్ చేసేందుకు రెడీగా ఉండేవారమని, ఎందుకంటే అక్కడ నటించే వాళ్లు చాలా బిజీ యాక్టర్స్ అన్న ఆయన, మళ్లీ వాళ్లను పంపించి వేరొకరు రప్పించలేను కదా అని ఆయన చెప్పారు.
ఓ సారి ఉదయం రైల్వే ట్రాక్ ఎక్కి నిలబడే సీన్‌ను షూట్ చేసేటందుకు రాజశేఖర్‌ను తొందరగా చెప్పానని, లొకేషన్, స్క్రిప్టు తన చేతిలో ఉంటాయి గానీ, యాక్టర్స్ కూడా తన చేతిలోనే ఉంటుంది, మీరు ఎప్పుడొచ్చినా సీన్ తీస్తానని, కానీ ట్రైన్ టైమ్ నా కంట్రోల్ ఉండదు కదా నువ్వు కచ్చితంగా టైంకి రావల్సిందేనని చెప్పానని శంకర్ అన్నారు. అప్పుడు దానికి ఆయన అయితే నేను మరి నిద్ర పోను అని అన్నారని, ఆయన చెప్పినట్టే గానీ ఆ రోజు నిద్ర పోలేదని, అనుకున్న టైంకి షూట్ చేశామని కూడా అని ఆయన తెలిపారు. కానీ రాజశేఖర్ మాత్రం తనతో కంఫర్ట్‌గా ఉంటారని శంకర్ వివరించారు.