Hero Rajasekhar : రాజశేఖర్.. డాక్టర్ మైఖేల్ జాక్సన్‌గా మారిన వేళ.!

Hero Rajasekhar : యాంగ్రీ యంగ్‌మెన్ అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే రాజశేఖర్ మంచి నటుడు. ‘అంకుశం’ సినిమాతో నెగిటివ్ రోల్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన ఆ తర్వాత తన యాక్షన్ సినిమాలతో మాస్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుhకున్నారు. రకరకాల పాత్రల్లో కనిపించి హీరోగా ప్రేక్షకుల మెప్పు పొందారు. తెలుగు నాట తనదైన ముద్ర వేశారు.

ఆయన నటించిన ‘అల్లరి ప్రియుడు’ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ సినిమాలో హీరోగా రాజశేఖర్‌ని ఎంచుకున్నందుకు చాలా నెగిటివిటీ వచ్చిందట టెక్నికల్ సపోర్ట్ నుంచి. కానీ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాత్రం ఆయన ఆ సినిమాలో హీరో అని గట్టిగా నొక్కి వక్కాణించాడట.

చాలా రిస్క్ చేస్తున్నారంటూ.. ఆయన సన్నిహితులు వారించారట. కానీ, ఫుల్ కాన్ఫిడెన్స్‌తో దర్శకేంద్రుడు ముందుకెళ్లారట. అలాగే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. రాజశేఖర్‌ కెరీర్‌లో బెస్ ఎవర్ మూవీగా నిలిచింది.

ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గానూ నిలిచింది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తాయ్. అయితే, రాజశేఖర్ డాన్సుల్లో కాస్త వీక్.. ఆ సంగతి అందరికీ తెలిసిందే. ఆయన కూడా అదే చెబుతుంటారు.

‘అల్లరి ప్రియుడు’ సినిమా చేసేటప్పుడు డాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడేవారట. కానీ, ప్రభుదేవా చాలా చక్కగా ఆయనతో డాన్స్ చేయించారనీ, తన బాడీ లాంగ్వేజ్‌కి సెట్ అయ్యే డాన్సు స్టెప్పుల్ని కంపోజ్ చేయడంలో  చాలా ఓపిక చూపించేవారనీ, అప్పటి సంగతుల్ని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సరదాగా.

రాజశేఖర్ ప్రస్తుతం ‘శేఖర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. జీవిత రాజశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నట్లు రాజశేఖర్‌కి నెగిటివ్ రోల్స్ పట్ల కూసింత మక్కువ ఎక్కువే. పలానా సినిమాలో రాజశేఖర్ విలన్ పాత్ర పోషిస్తారట.. అంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతూనే వుంది. కానీ ఇంతవరకూ వీలు కాలేదు. అందుకు తగ్గ కథలు సెట్ కావాలి కదా. లెట్స్ వెయిట్ అండ్ సీ.