అభిమానికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన హీరో నిఖిల్.. జాగ్రత్తగా చూసుకో అంటూ పోస్ట్?

ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు పెద్దఎత్తున గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవడం సర్వసాధారణం అయింది. సాధారణంగా సినిమాలు హిట్ అయితే హీరోలకు దర్శకులకు నిర్మాతలు గిఫ్టు ఇవ్వడం మనం చూస్తున్నాము. అయితే తాజాగా విక్రమ్ సినిమా సూపర్ హిట్ అవడంతో కమల్ హాసన్ దర్శకుడికి, అసిస్టెంట్ డైరెక్టర్లకు పెద్ద ఎత్తున ఖరీదైన బహుమతులను అందజేశారు.అదే విధంగా బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నటించిన సినిమా మంచి హిట్ అవడంతో నిర్మాత ఏకంగా నాలుగు కోట్ల ఖరీదు చేసే కారును బహుమానంగా ఇచ్చారు.

ఇదిలా ఉండగా తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సైతం తన అభిమానికి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైస్ చేశారు. తాజాగా అఖిల్ నటిస్తున్నటువంటి కార్తికేయ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని సందడి చేశారు.ఈ వేడుకలో భాగంగా మహేష్ అనే ఒక అభిమాని తాను నిఖిల్ కి పెద్ద అభిమాని అని ఇప్పటివరకు ఆయన నటించిన ప్రతి ఒక్క సినిమా చూసాను అంటూ తన అభిమానాన్ని బయటపెట్టారు.

ఈ క్రమంలోనే మహేష్ ను నిఖిల్ వేదికపైకి ఆహ్వానించి తనకు తన కళ్ళజోడును బహుమానంగా ఇచ్చారు. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. బ్రో కళ్ళజోడును జాగ్రత్తగా చూసుకోండి. మీరు నాపై చూపించిన ప్రేమకు గుర్తుగా ఇచ్చిన బహుమానం అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు.ఈ క్రమంలోనే ఈయన తన అభిమానికి కళ్ళజోడును గిఫ్ట్ గా ఇచ్చారనే విషయం సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారింది.ఇక ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు .ఈ సినిమా జూలై 22 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడంతో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు.