Nagarjuna: తండేల్ సక్సెస్ పై రియాక్ట్ అయిన నాగార్జున…. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Nagarjuna : సినీ నటుడు నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం తండేల్. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మాణంలో నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత నాగచైతన్య కెరీర్ లో ఇలాంటి సక్సెస్ రావడంతో అక్కినేని అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా ఇప్పటికే సుమారు 50 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తుంది. అదే విధంగా ఈ సినిమా స్టోరీతో పాటు మ్యూజిక్ అలాగే పాటలు కూడా సినిమాకు మంచి సక్సెస్ అందించాయని చెప్పాలి. ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమాపై ఎంతో మంది సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్న నాగార్జున మాత్రం ఇప్పటివరకు ఈ సినిమా సక్సెస్ గురించి స్పందించలేదు అంటూ కామెంట్లు వినిపించాయి.

ఈ క్రమంలోనే నాగర్జున ఈ విమర్శలకు చెక్ పెడుతూ సోషల్ మీడియా వేదికగా తండేల్ సినిమా సక్సెస్ గురించి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా నాగార్జున స్పందిస్తూ…ప్రియమైన చైతు.. నేను గర్వపడుతున్నాను.. సరిహద్దులను దాటి పోతూ, సవాళ్లను ఎదుర్కొంటూ కళకు నీ గుండెను ఇచ్చినట్లు చూశాను. ‘తండేల్’ ఇది కేవలం ఒక సినిమా కాదు. నీ అభిరుచి, నీవు కష్టపడి సాధించిన విజయానికి నిదర్శనం అంటూ నాగచైతన్య గురించి, సినిమా సక్సెస్ కావడం గురించి ఈయన ఎంతో గర్విస్తూ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతుంది.

ఇక నాగచైతన్య చివరిగా సాయి పల్లవితో కలిసి నటించిన లవ్ స్టోరీ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన పలు చిత్రాలలో నటించినా అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. ఇలా లవ్ స్టోరీ తర్వాత తిరిగి సాయి పల్లవితో నటించిన ఈ చిత్రం ద్వారా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.