ముఖం చూస్తేనే తెలుస్తోంది!!.. అవమానించిన నెటిజన్‌కు మాధవన్ ఘాటు రిప్లై

Hero Madhavan Counter To Netizen ABout Drugs

సోషల్ మీడియాలో ఎంత పాజిటివిటీ ఉంటుందో అంతే స్థాయిలో లేదా అంతకు మించి అనేలా నెగెటివిటీ ఉంటుంది. ముఖ్యంగా సెలెబ్రిటీల విషయంలో అయితే పాజిటివిటీ గోరంతా ఉంటే నెగెటివిటీ కొండంత ఉంటుంది. సమయం సందర్భం లేకపోయినా సరే సెలెబ్రిటీలను విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం వాటిని పట్టించుకోరు. ఇంకొందరు మాత్రం గట్టిగా రివర్స్ కౌంటర్ వేస్తారు.

Hero Madhavan Counter To Netizen ABout Drugs
Hero Madhavan Counter To Netizen ABout Drugs

తాజాగా మాధవన్ కూడా అలా ఓ నెటిజన్‌కు ఘాటుగా బదులిచ్చాడు. నేను మ్యాడీకి పెద్ద అభిమానిని. కానీ అతడు మద్యంకు బానిసై, డ్రగ్స్‏కు అలవాటు పడుతూ తన కెరీర్‏ను, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం చూడలేకపోతున్నాను. రెహ్నా హై తేరా దిల్ మే.. సినిమాతో బాలీవుడ్‏లోకి అడుగుపెట్టినప్పుడు ఎలా ఉండేవాడు? ఇప్పుడెలా తయారయ్యాడు? అసలు అతడు ఎం చేస్తున్నాడో అతడి ముఖం చూస్తేనే తెలుస్తోంది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

ఆ ట్వీట్ చూసిన మాధవన్ అదిరిపోయే కౌంటర్ వేశాడు. ఓహో.. ఇదా మీరు చేసేది? పాపం, మీ పేషెంట్లను చూస్తుంటే నాకు జాలేస్తోంది. నాకు తెలిసి నువ్వు తొందరగా డాక్టర్ అపాయింట్‏మెంట్ తీసుకోవడం మంచిదంటూ సెటైర్ వేశాడు.. ప్రస్తుతం మాధవన్ మారా సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు.. జనవరి 8న అమెజాన్ ప్రైమ్‏లో ఈ చిత్రం విడుదల కానుంది.