Visa: గల్లా అశోక్ వీసా మూవీ టీజర్ విడుదల..ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ కు బాగా కనెక్ట్ అయ్యే కథ అంటూ!

Visa: టాలీవుడ్ యంగ్ హీరో, మహేష్ బాబు మేనల్లుడు ఘట్టమనేని మనవడు గల్లా అశోక్ గురించి మనందరికీ తెలిసిందే. మొదట హీరో అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు గల్లా అశోక్. మొదటి సినిమాతోనే హీరోగా తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. అయితే ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు అశోక్. దర్శకుడు ఉద్భవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వీసా. గల్లా అశోక్ ఇందులో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమాలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్యలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ గౌరీ ప్రియ, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయడంతో పాటు ఈ సినిమాకు వీసా (వింటారా సరదాగా) అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్గా స్పందన లభించింది. ఇలా ఉంటే ఇవాళ తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. టీజర్ వీడియోతో సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేశారు.

VISA - Vintara Saradaga TEASER | Ashok Galla, Sri Gouri Priya | Udbhav | Naga Vamsi S | Sai Soujanya

అయితే టీజర్ చూసిన వెంటనే ఇది పూర్తిగా అమెరికా నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. చదువుల కోసం అమెరికాకు వెళ్లిన యువతరం జీవితాల్లో వచ్చే మలుపులు, కష్టాలు, ప్రేమలు, బ్రేక్ అప్‌లు అన్నీ ఇందులో ఉన్నట్లు టీజర్ తో క్లారిటీ ఇచ్చేశారు. అలాగే డైరెక్టర్ ఉద్భవ్ తన తొలి సినిమాతోనే కంటెంట్‌ ను కనెక్ట్‌ గా చూపించే ప్రయత్నం కూడా చేశారు. టీజర్‌ లో చూపించిన అమెరికన్ విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫన్నీ డైలాగులు, ఫన్ మోమెంట్స్, లవ్ అన్నీ కలగలిసిన టోన్‌ తో ఈ టీజర్‌ను కట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఇందులో ఆంద్ర తెలంగాణ తరువాత మన తెలుగు వాళ్ళు బాగా కనెక్ట్ అయిన స్టేట్స్ యునైటెడ్ స్టేట్స్? అనే డైలాగ్ తో హైలెట్ అయ్యింది. చాలా మంది ఎన్‌ఆర్‌ఐ స్టూడెంట్స్ కు ఇది దగ్గరగా ఉంది. ఇది ప్రేక్షకులను సినిమాకు మరింతగా ఆకర్షించేలా ఉంది. అంతేకాకుండా ఈ సినిమా ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.