“గూగుల్ టాప్ 100” లో రూల్ చేసిన మన స్టార్ హీరో హీరోయిన్స్ వీళ్ళే..!

ప్రపంచ ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ కోసం తెలియని వారు ఎవరూ ఉండరు. ఏ చిన్న డౌట్ ఉన్నా ఇలా గూగుల్ లో ప్రశ్న వేస్తే ఎన్నో సమాధానాలు వచ్చేస్తాయి. అలా గూగుల్ లో ఎంతో మంది సినిమా స్టార్స్ కోసం కూడా నెటిజన్స్ వెతుకుతూ ఉంటారు. అలా ప్రతి ఏడాది గూగుల్ నుంచి టాప్ లో నిలిచిన సెలెబ్రెటీల లిస్ట్ మన ఇండియా నుంచి కూడా వస్తుంది. 

అలాగే ఈ ఏడాదికి ఒక్క ఇండియాలోనే కాకుండా మొత్తం ఆసియా లో అత్యధికంగా వెతకబడిన సినీ తారలు అందులో మన సౌత్ ఇండియా స్టార్ హీరో హీరోయిన్స్ నంబర్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. మరి ఈ లిస్ట్ లో టాప్ నుంచి 100 లోపు చూస్తే టాప్ 15 లో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆశ్చర్యకరంగా నిలవగా టాప్ 18 లో సమంత, 19 లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 20 లో రష్మికా మందన్నా. 

అలాగే 37 లో మిల్కీ బ్యూటీ తమన్నా లు నిలిచారు. అలాగే 44, 47 లలో పూజా హెగ్డే మరియు సూపర్ స్టార్ మహేష్ బాబులు నిలవగా 53, 56 లలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు స్వీటీ అనుష్కలు నిలిచారు. 

ఇంకా 58 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, 62లో కీర్తి సురేష్, 68లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, చివరిగా 91వ స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ లు సౌత్ నుంచి గూగుల్ లో టాప్ 100 లో నిలిచారు. అయితే వీరిలో ప్రభాస్ 68లో కనిపించడం ఆసక్తిగా మారింది. అలాగే అల్లు అర్జున్ ఎప్పటిలానే టాప్ లో ఉన్నాడు.