ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతోమంది సింగర్లు తమ పాటలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇలా సింగర్లుగా బాగా పాపులర్ అయిన వారిలో హేమచంద్ర, శ్రావణ భార్గవి జంట కూడా ఒకటి. వీరిద్దరు సింగార్లుగా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ లుగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సూపర్ సింగర్ షో లో కలిసి పాల్గొన్న వీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుని 2013లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కూతురు. ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా జీవితం సాగిస్తున్నారు.
వివాహం చేసుకున్న తర్వాత కూడా వీరిద్దరూ కలిసి జంటగా పలు టీవీ షోలకు యాంకరింగ్ చేశారు. అంతే కాకుండా హేమచంద్ర ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ షో లో జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ఇక శ్రావణ భార్గవి సరిగమప షో లో మెంటర్ గా వ్యవహరిస్తోంది. ఇలా ఒక వైపు సింగర్స్ గా మరొకవైపు డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇద్దరూ తమ కెరీర్లో బిజీగా ఉంటున్నారు. అయితే తాజాగా వీరిద్దరికీ సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.
తొమ్మిది సంవత్సరాలుగా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ప్రస్తుతం విడాకులు తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ గత కొంత కాలంగా వేరుగా ఉన్నట్టు సమాచారం. అయితే ఇటీవల వీరిద్దరు కలిసి తెలుగు ఇండియన్ ఐడల్ షో కి గెస్టులుగా హాజరయ్యారు. మరి ఇప్పుడు మాత్రం వీరిద్దరు విడాకులు తీసుకోవటానికి సిద్ధపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే హేమచంద్ర, శ్రావణ భార్గవి ఈ విషయంపై స్పందించాల్సి ఉంటుంది. మరి వీరిద్దరూ తమ విడాకుల వార్తల గురించి ఎలా రియక్ట్ అవుతారో చూడాలి మరి.