శివబాలాజీని కొరికిన హేమ.. ఎందుకంటే.?

సినీ నటి హేమ, సినీ నటుడు శివబాలాజీ చేతిని కొరికింది. మంచు విష్ణు క్యాంపుకి చెందిన వ్యక్తి శివబాలాజీ కాగా, ప్రకాష్ రాజ్ ముఠాకి చెందిన వ్యక్తి హేమ. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో లోపల కొట్టుకుంటున్నారు, బయటకొచ్చి చిరునవ్వులు చిందిస్తున్నారు ఇరువురు ప్యానళ్ళకు చెందినవారు, వారి మద్దతుదారులు.

ఈ క్రమంలో జరిగిన గలాటాలోనే హేమ, శివబాలాజీ చేతిని కొరికింది. కొరికిన వైనం మీడియాకి చిక్కింది. దాంతో, హేమ తప్పించుకోవడానికి వీల్లేకుండా పోయింది. ‘కొరికిన మాట వాస్తవమే. కానీ, ఎందుకు కొరికానో తెలుసా.? ఆ విషయం శివబాలాజీనే అడగండి..’ అంటూ తనదైన స్టయిల్లో హేమ వ్యాఖ్యానించింది.

ముందుకి ఎవర్నీ కదలనీయకుండా శివబాలాజీ అడ్డుకోవడంతో, అతన్ని తప్పించేందుకు హేమ కొరికినట్లుగా కనిపిస్తోంది. ఇరు ప్యానళ్ళకు చెందిన ముఖ్యులు.. అంటే ప్రెసిడెంట్ అభ్యర్థులైన ప్రకాష్ రాజ్, విష్ణు మీడియా ముందుకొచ్చి నవ్వుతూ కనిపిస్తున్నారు.. ఒకరి భుజమ్మీద ఇంకొకరు చెయ్యేసుకుంటూ సందడి చేస్తున్నారు.

వాళ్ళూ, వీళ్ళూ అన్న తేడాల్లేవు. ‘మా’ ఎన్నికల నేపథ్యంలో చాలా గలాటానే జరిగింది. ఇంతకు ముందెన్నడూ లేని ప్రత్యేకమైన పరిస్థితి ఇది. అదే సమయంలో, అనూహ్యంగా ఓటింగ్ కూడా ఈసారి పెరిగినట్లే కనిపిస్తోంది.