మంచు విష్ణుపై సెటైర్లు వేసిన ప్రకాష్ రాజ్.!

‘మా’ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో 90 శాతం నెరవేర్చేసినట్లు ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయమై తాజాగా ప్రకాష్ రాజ్ సెటైర్లేశాడు. ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు చేతిలో ప్రకాష్ రాజ్ ఓడిపోయారు.

‘గెలిచారు కదా.. ఇంకో ఏడాది సమయం వుంది.. ఏంచేస్తారో చూద్దాం..’ అని ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ‘పాలన’పై సెటైర్లు వేయడం గమనార్హం. ’90 శాతం చేసేశామంటున్నారు మంచు విష్ణు..’ అని అడిగితే, ‘ప్రకటించడం ఏముంది.? వెరైనా ప్రకటించేయొచ్చు.. కానీ, పనులు జరగాలి కదా.! అది సభ్యులకు తెలుస్తుంది. వారు డిసైడ్ చేస్తారు..’ అంటూ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.

‘మా’ ఎన్నికలు చాలా చాలా ఛండాలంగా జరిగాయి. బూతులు తిట్టుకున్నారు.. భౌతిక దాడులకు కూడా దిగారు. ప్రకాష్ రాజ్ వర్గం – మంచు విష్ణు వర్గం.. నానా యాగీ చేసి, సినీ పరిశ్రమ పరువుని బజార్న పడేశారన్నది నిర్వివాదాంశం.

ఇంతా చేసి, వెయ్యి మంది కూడా ఓటర్లు లేరు ‘మా’ అనే చిన్న అసోసియేషన్‌లో. ‘మా’ కార్యాలయాన్ని కట్టించేస్తానన్న మంచు విష్ణు, గెలిచి ఏడాది అవుతున్నా.. ఇంతవరకూ ఆ విషయమై స్పష్టతనివ్వడంలేదు.

ఇంతకీ, మళ్ళీ ఇంకోసారి విష్ణు – ప్రకాష్ రాజ్ తలపడతారా.? ఈ ప్రశ్నకు ప్రకాష్ రాజ్ బదులిస్తూ.. ‘చూద్దాం.. ఇంకా ఏడాది సమయం వుంది కదా..’ అని చెప్పారు. అంటే, పోటీ చేసే ఉద్దేశ్యం వున్నట్లే లెక్క. ‘మా’ కార్యాలయం అనేది అతి ముఖ్యమైన అంశం.. కానీ, దాన్ని పక్కన పడేశారు పూర్తిగా.!