Shiva Balaji: శివ బాలాజీని కొరకడానికి అసలు కారణం అదే : నటిహేమ

Shiva Balaji: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవలె మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు ముగిసిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ ఎన్నికల సమయంలో జరిగిన గందరగోళం అంతా ఇంతా కాదు. ఈ ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు మాటలను సందించుకోవడం, అదేవిధంగా ప్రకాష్ రాజ్ వర్గానికి చెందిన నటి హేమ.. విష్ణు ప్యానల్ కు చెందిన శివ బాలాజీ చెయ్యి కొరికింది అని నరేష్ చెప్పడం, అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడం ఇలా మొత్తంగా మా ఎన్నికలు గందరగోళంతో రసవత్తరంగా ముగిసాయి. ఇక నటి హేమ శివ బాలాజీ చేయి కొరకడం పెద్ద వివాదాన్ని సృష్టించింది. ఇది ఇలా ఉంటే తాజాగా నటి హేమ శివబాలాజీ కోరడానికి అసలు కారణం ఏమిటి అన్న విషయం పై స్పందించింది. మా గొడవలు నాది కూడా ఒక ఇష్యూ ఉంది.

హేమ శివ బాలాజీ ని ఎందుకు కొరికింది? అన్నది పెద్ద పజిల్.. ఆ రోజు మీడియా ముందుకు వచ్చి ఏం జరిగిందో బయట పెట్టేద్దాం అని అనుకున్నాను.. కానీ ప్రకాష్ రాజ్ గారు నన్ను వద్దమ్మా.. ఈ సమయంలో ఏం జరిగినా ఎలక్షన్స్ ఆపేస్తారు.. వాటికి మనం కారణం కాకూడదు అని ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం తో ఆరోజు మౌనంగా ఉండి పోయాను అని చెప్పుకొచ్చింది హేమ. ఆ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ ని చాలా అవమానించారని.. అయినప్పటికీ ఆయన గాంధీ మార్గంలో నడిచారు అని తెలిపింది హేమ. అసలు నేను శివబాలాజీ కొరకడానికి ముందు మా ప్యానల్ కి మా మెంబెర్ ఓటు వేయమని అక్కడికి వచ్చిన వాళ్ళకి బ్యాలెట్ షీట్లు ఇస్తున్నాడు. అతనితో పాటు విష్ణు ప్యానల్ కి సంబంధించిన రాజేశ్వరి అనే ఒక ఆవిడ కూడా పేపర్స్ పంచుతోంది. ఆవిడకు నేను చాలా సార్లు చెప్పాను ఇక్కడ పబ్లిసిటీ చేయొద్దని అన్నారు కదా.. ఎందుకు చేస్తున్నారు అని అడిగాను.

కానీ ఆమె వినకపోగా శివ బాలాజీ వైఫ్ వాళ్ళ ప్యానల్ కార్డు తీసుకుని వచ్చేసి.. వీళ్ళు మన వాళ్ళు.. మన ప్యానల్ దీనికి ఓటు వేయు అని చెప్తుంది.. ఈ సంఘటన అంతా కూడా ఓటింగ్ జరిగే చోట జరిగింది.. ఎలక్షన్ కమిషనర్ ముందు జరిగిన ఏం పట్టించుకోలేదు.. శివ బాలాజీ అనే వ్యక్తి, రాజేశ్వరి కానీ.. వాళ్ళ వైఫ్ ని కానీ ఒక్క మాట అనలేదు.. మా ప్యానల్ కి సంబంధించిన వ్యక్తి ఓటు అడిగేసరికి.. నరేష్ గారు వెంటనే రియాక్ట్ అయి పోయి వాటిని పట్టుకోండి వేద్దాం అని వెంటపడ్డారు.. నరేష్ గారు వాళ్ళ బాడీ గార్డ్స్.. ఇంకొక పది మంది కలసి మా ప్యానల్ సంబంధించిన వ్యక్తి వెంటపడి పట్టుకుని కొట్టేస్తున్నారు.. అది చూసి నేను అతన్ని కాపాడ్డానికి వెళుతున్న సమయంలో శివబాలాజీ నేను వెళ్లకుండా చేయి అడ్డు పెట్టి ఆపేశాడు.. అప్పుడు నేను చెయ్యి తీయమని ఎంత గట్టిగా అరిచినా కూడా శివ బాలాజీ చెయ్యలేదు.. అందుకే నేను శివబాలాజీ చెయ్యి కొరికాను.. కొరకడానికి ప్రయత్నించాను కానీ పూర్తిగా కొరకలేదు అని చెప్పుకొచ్చింది హేమ.