ఉత్తర తెలంగాణకు ‘ఆరెంజ్‌’ హెచ్చరిక జారీ చేసిన వాతావరణశాఖ

ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ వరకూ 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం పగలు కొన్నిచోట్ల వర్షాలు కురిశాయి. ఇతర ప్రాంతాల్లో ఉష్టోగ్రతలు పెరిగిగాయి. అత్యధికంగా కాటారంలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజలు వడదెబ్బ తగలకుండా అప్రమత్తంగా ఉండాలని ఉత్తర తెలంగాణ ప్రాంతానికి వాతావరణశాఖ ఆరెంజ్‌ రంగు హెచ్చరిక జారీచేసింది.