తెలుగు లో తొలి పాన్ ఇండియా హీరో అతనే

ఇప్పుడు అంత పాన్ ఇండియా హవా నడుస్తుంది…సౌత్ హీరోలందరూ పాన్ ఇండియా ఇమేజ్ కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, యష్ ఇలా అందరూ పాన్ హీరోల్లా నిరూపించుకోవాలని తీవ్రంగా కష్టపడుతున్నారు.

చాలా మంది ప్రభాస్ తెలుగు లో మొదటి పాన్ ఇండియా హీరో అనుకుంటున్నారు. కానీ, 1990 లోనే నాగార్జున ‘శాంతి క్రాంతి’, ‘రక్షకుడు’ లాంటి భారీ సినిమాలతో పాన్ ఇండియా హీరో లా ట్రై చేసాడు, కానీ ఆ సినిమాలు ప్లాప్ అవ్వడం తో మళ్ళీ వాటి జోలికి వెళ్ళలేదు.

అయితే….ఎన్టీఆర్, ఎన్నార్ కంటే ముందే మన తెలుగు నటుడు పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అతనే పైడి జైరాజ్. 1909 సెప్టెంబర్ 28వ తేదీన కరీంనగర్ లో ఆయన జన్మించారు. మూకీల చివరిలో .. టాకీల మొదట్లో ఆయన తెరపై సందడి చేయడం వలన ఈ తరం ప్రేక్షకులకు ఆయన అస్సలు తెలియదు. పైడిరాజు తెలుగువాడైనప్పటికీ తెలుగు సినిమాలు చేయకపోవడం వలన మనకి పాత తెలుగు సినిమాల్లో ఆయన ఎక్కడా కనపడలేదు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది మద్రాసు .. బొంబాయి .. కలకత్తాల చుట్టూ తిరుగుతున్న సమయంలో ఆయన హీరో గా కొన్ని సినిమాలు చేసారు.

మూకీలలో జైరాజ్ మొదటి సినిమా ‘రసిలీ రాణి’ .. టాకీలలో తొలి సినిమా ‘షికారీ’. సాంఘిక .. జానపద .. చారిత్రక .. యాక్షన్ సినిమాలలో జైరాజ్ నటించి మెప్పించారు. అప్పట్లోనే గుర్రపుస్వారి .. కత్తి యుద్ధంలో ఆరితేరిన ఆయనను తొలి యాక్షన్ హీరోగా చెప్పుకున్నారు. 1960లలోనే తొలిసారిగా ప్రేక్షకులకు ‘సూపర్ మేన్’ ను పరిచయం చేసింది ఆయనే.

నర్గీస్ … మీనా కుమారి .. మధుబాల .. గీతాబాలి .. దేవికారాణి ఆయన లాంటి అలనాటి స్టార్ హీరోయిన్స్ తో ఆయన నటించారు. పృథ్వీరాజ్ కపూర్ .. రాజ్ కపూర్ .. అశోక్ కుమార్ వంటి స్టార్ లతో కలిసి ఆయన నటించారు. హిందీ .. ఉర్దూ .. ఇంగ్లిష్ .. మరాఠీ .. గుజరాతి భాషలలో కలుపుకుని 300 వరకూ సినిమాలు చేసిన ఆయన చివరివరకూ తెలుగు సినిమా చేయకపోవడం ఆశ్చర్యం. అనేక భాషల్లోని ప్రేక్షకులను ఆకట్టుకున్న పైడి జైరాజ్ 1980లో ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డును అందుకున్నారు. ఆగస్టు 11 .. 2000లలో ముంబైలో కన్నుమూశారు.