Bheemla Nayak : “భీమ్లా నాయక్” లో కొక్కిలి దేవరని పరిచయం చేసిన నటుడు ఎవరో తెలిస్తే షాక్!

 Bheemla Nayak :  గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ హీరోగా రానా దగ్గుబాటి మరో హీరోగా నటించిన లేటెస్ట్ భారీ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్”. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం గత ఫిబ్రవరి 25న రిలీజ్ అయ్యి భారీ ఓపెనింగ్స్ ని ఈ చిత్రం అందుకుంది. అయితే ఈ సినిమా చూసాక కొన్ని ఎలిమెంట్స్ అయితే అభిమానులని సినీ ప్రేమికులని వెంటాడాయి.
మరి వాటిలో పవన్ పై చూపించే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఒకటి. “కొక్కిలి దేవర” అనే పవర్ ఫుల్ పాత్ర లో పవన్ కనిపించడం ఒకెత్తు అయితే ఆ రోల్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తూ రానా కి కథ చెప్పే పాత్రదారుడుగా ఓ నటుడు కనిపిస్తాడు. ఆ నటుడు ఎవరో తెలిస్తే డెఫినెట్ గా చాలా మంది షాక్ అవ్వొచ్చు.
ఈ సినిమాలో గడ్డం అంత వేసుకొని కనిపించిన ఈ నటుడు ఆల్రెడీ ఇదే పవన్ నటించిన సినిమా “గబ్బర్ సింగ్” సినిమాలో కూడా ఉన్నాడు. ఆ సినిమాలో సూపర్ హిట్ ఎపిసోడ్ అయినటువంటి అంత్యాక్షరి లో మీరొచ్చాక ఫిజికల్ గేమ్స్ మానేసాంగా అని చెప్తాడు కదా ఆ నటుడే చౌదరి ఇతడే ఇపుడు భీమ్లా నాయక్ లో కూడా కీలక పాత్ర చేశారు..
అతన్నే భీమ్లా నాయక్ లో త్రివిక్రమ్ తమ కొక్కిలి దేవరని పరిచయం చెయ్యడానికి వినియోగించాడు. ఏది ఏమైనా ఆ సినిమాకి ఈ సినిమాకి అతను మారిపోయాడు దీనితో వెంటనే అందరికీ గుర్తు పట్టడం కష్టం అయ్యింది. కానీ తర్వాత అలా నెమ్మదిగా రివీల్ అయ్యింది.