దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం లో మంత్రి హరీశ్ రావు ఘాటు విమర్శలు.. ??

 

ఒకవైపు ప్రపంచాన్ని ఈ ట్వంటి ట్వంటి ఈడ్చి తంతుంటే మరోవైపు తెలంగాణాలో వర్షాలు ప్రజలతో, అధికార పార్టీ నాయకులతో చెడుగుడు ఆడుతుంది.. ఇదే సమయంలో ఇంకో వైపు దుబ్బాక ఉప ఎన్నికల పోరు రోజు రోజుకి రసవత్తరంగా మారుతోంది. ఇక్కడ ఇదివరకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తన ప్రచారంలో ఎంపీ రేవంత్‌రెడ్డిని ఆయుధంగా వాడుకుంటున్నాడు.. ఇక రేవంత్ రెడ్ది మాటలు తూటాల్లా వదులుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో మోసపోయిన ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికను అవకాశంగా తీసుకుని తగిన గుణపాఠం చెప్పాలని, ప్రత్యేక రాష్ట్రం అవిర్భవించిన తర్వాత ఎలాంటి అభివృద్ది జరగలేదని టీఆర్ఎస్ మీద దాడికి దిగారు..

ఇక బీజేపీ కూడా ఇక్కడ గెలిచి అధికార పార్టీ హవాకు బ్రేకులు వేయాలని చూస్తుంది.. మరి కారు గుర్తు ఊరికే ఉంటుందా టాప్ గేరు వేసి ట్రిబుల్ షూటర్ అనబడే హరీశ్ రావును రంగంలోకి దించింది.. ఈ నేపధ్యంలో దౌల్టాబాద్ లోని ముబారస్ పుర్ లో ప్రచారంలో భాగంగా హరీష్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీ లు ఎండమావులు వంటివి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిని నమ్ముకుని వారి వెంట వెళ్తే ఏమి రాదు.. వానాకాలం లో ఉసిల్లు వచ్చినట్లు గా కాంగ్రెస్ మరియు బీజేపీ నేతలు వచ్చి పోతుంటారంటూ వ్యంగంగా ఘాటు విమర్శలు చేశారు.. ఇక తెరాస మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తోందని పేర్కొన్నారు..

అదీగాక గతంలో తీవ్రంగా ఉన్న త్రాగునీటి సమస్యను కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కూడా తీర్చ లేకపోయాయి అని అన్నారు. కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడు విద్యుత్ కూడా ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేశారు అని తెలిపారు. ఇకపోతే దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం లో అధికార, ప్రతి పక్ష పార్టీ నేతలు ఇలా ఒకరి పై మరొకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారని అనుకుంటున్నారట.. ఇదిలా ఉండగా స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి ఇటీవల గుండెజ‌బ్బుతో కన్నుమూసిన నేపథ్యంలో ఆ స్థానంలో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది..

కాగా ఈ నియోజక వర్గంలో నవంబర్‌ 3న పోలింగ్‌ నిర్వహంచి ఇదే నెల 10వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది.. ఇక సామాన్య మానవుడు బయటికి చెప్పుకోక పోయినా కేసీయార్ గారు చేసిన అభివృద్ధి తెలంగాణ ప్రజలకు నిదుర లేకుండా చేస్తుంది అంటూ మనసులో అనుకుంటున్నాడట..