దుబ్బాకలో ప్లాన్ మార్చిన హరీష్..ఫలించేనా..?

harish rao telugu rajyam

 దుబ్బాకలో ఎలాగైనా గెలిచి తీరాలని తెరాస అధినాయకత్వం గట్టిగానే పావులు కదుపుతుంది. ఆ నియోజకవర్గంలో కలిసివచ్చే ఎలాంటి అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. దాదాపు నెల రోజుల నుండే తెరాస పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు అక్కడ మకాం వేసి, ప్రచారం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత కు టిక్కెట్ ఇవ్వటంతో తెరాస రెబల్ అభ్యర్థి చెరకు శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లి ఆ పార్టీ టిక్కెట్ మీద బరిలో నిలబడ్డాడు.

dubbaka sujatha telugu rajyam

 

శ్రీనివాస్ రెడ్డికి స్థానికంగా గట్టి పట్టు ఉండటంతో అతన్ని హరీష్ రావు తేలిగ్గా తీసుకోవటం లేదు. కాంగ్రెస్ పార్టీలో శ్రీనివాస్ రెడ్డిని వ్యతిరేకించే వర్గాన్ని గుర్తించి వాళ్ళని తెరాసలో చేర్చుకుంటూ అవతలి పార్టీ అభ్యర్థిని బలహీన పరచటానికి సిద్ధం అవుతున్నాడు. హరీష్ రావు ఎన్నికల్లో ఎక్కువగా ఉపయోగించే ప్లాన్స్ అన్ని ఇదే తరహాలో ఉంటాయి.. అవతలి పార్టీ అభ్యర్థికి సరైన బలం లేదనే టాక్ బాగా స్ప్రెడ్ చేసి, అటు ఇటు గా వుండే వర్గాన్ని తమవైపు తిప్పుకొని విజయం సాధించటం హరీష్ రావు లక్షణం. అయితే అదే ప్లాన్ తో దుబ్బాకలో విజయం సాధించటం కష్టమని భావించి, మరో రకంగా ముందుకి వెళ్తున్నాడు, తనకి సిద్దిపేట , దుబ్బాక రెండు కళ్ళు లాంటివి అని, తనని చూసి తెరాస కు ఓట్లు వేయాలని, సిద్దిపేట ను అభివృద్ధి చేసినట్లు దుబ్బాకను కూడా చేస్తానని చెపుతూ ప్రచారం చేస్తున్నాడు.

  గత ఐదారేళ్ళ నుండి దుబ్బాకలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదు, ఆ మచ్చ చెరిపేయటానికే సిద్దిపేటను ఉదాహరణగా చూపిస్తున్నాడు. దానికి తోడు ఇక్కడ పోటీచేస్తున్న సుజాతకు రాజకీయంగా కనీస అనుభవం లేదు. ఏమి మాట్లాడాలో కూడా సరిగ్గా తెలియదు, కేవలం ఆమెను సానుభూతి కోసమే పోటీలో దించారు. అందుకే తనని చూసి ఓట్లు వేయాలని హరీష్ రావు కోరుకుంటున్నాడు. సుజాతకు తోడుగా పద్మ దేవేందర్ రెడ్డిని నియమించి ఎన్నికల ప్రచారంలోకి పంపిస్తున్నాడు. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికల బాధ్యత మొత్తం హరీష్ రావు తన మీదేసుకొని నడిపిస్తున్నాడు. మరి హరీష్ మార్క్ రాజకీయం ఫలించి దుబ్బాకలో మరోసారి తెరాస జెండా ఎగురుతుందో లేదో చూడాలి.