Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాల షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. ఇటీవల హరిహర వీరమల్లు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ పూర్తిగా నిరాశపరిచారు. అయితే ఇటీవల ఓజీ సినిమా నుంచి పవర్ స్ట్రోమ్ సాంగ్ ను విడుదల చేయడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభించిన షెడ్యూల్ చిత్రీకరణ కూడా పూర్తి అయింది అని తెలుస్తుంది.
ఈ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి కావడంతో దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. ”మాట ఇస్తే నిలబెట్టుకోవడం… మాట మీదే నిలబడడం (పవన్ కళ్యాణ్ నైజం!)” అని ట్వీట్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. దాంతో పాటు ఒక ఫోటో కూడా షేర్ చేశారు. అందులో ఆయన కూర్చుని ఉండగా పక్కనే పవన్ నిలబడ్డారు. ఆ మూమెంట్ గురించి… ”మీరు (పవన్ కళ్యాణ్) పక్కన ఉంటే కరెంటు పాకినట్టే” అని తెలిపారు. హరీష్ శంకర్ అభిమానులకు గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పాలి.
ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమాలో మరో హీరోయిన్ రాశి కన్నా కూడా భాగమైన సంగతి తెలిసిందే. ఇటీవల పూర్తి అయిన షెడ్యూల్ చిత్రీకరణలో రాశి కన్నాకు సంబంధించిన సన్నివేశాలను కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్లో ఉన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే విడుదల తేదీ గురించి ప్రకటించనున్నారు. ఈలోపు పవన్ కళ్యాణ్ ఓ జి సినిమా విడుదల కానుంది ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందు రాబోతుంది.
