HHVM: వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా వేడుకనా? రాజకీయ సభనా… టెన్షన్ లో అభిమానులు?

HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా జులై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల తేదీ మరొక ఐదు రోజుల్లో ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఈ నెల 21వ తేదీ హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన నేపథ్యంలో అభిమానులలో తెలియని ఆందోళన మొదలైంది. ఈ కార్యక్రమానికి సినిమా సెలబ్రిటీలు కాకుండా పెద్ద ఎత్తున తెలంగాణకు చెందిన కొందరు మంత్రులతో పాటు ఆంధ్ర కర్ణాటకకు చెందిన మంత్రులు కూడా హాజరు కాబోతున్నారని తెలియడంతో అభిమానులు షాక్ అవుతారు. ఇలా మంత్రులందరు ఈ కార్యక్రమానికి వస్తున్నారు అంటే ఇదేమైనా సినిమా వేడుకనా? లేదా రాజకీయ సభనా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులు ముఖ్య అతిథులుగా వచ్చిన పర్వాలేదు కానీ వేదిక పైకి ఎక్కి రాజకీయాల గురించి మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ తిరిగి సనాతన ధర్మం గురించి ఎక్కడ మాట్లాడి లేనిపోని వివాదాలను సృష్టిస్తారేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు ఇక ఈ సినిమా కూడా సనాతన ధర్మం గురించి ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ ధోరణిలో మాట్లాడితే సినిమా పట్ల నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఇక ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఏ సినిమా వేడుకకు వచ్చిన ఆ వేడుకను కాస్త రాజకీయ సభగా మార్చుకుంటూ గత ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఈయన ముఖ్య అతిథిగా హాజరైన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కూడా ఇదే జరిగింది. దీంతో ఈ వేడుక పట్ల అభిమానులు ఆందోళన కనబరుస్తున్నారు.