Harihara Veeramallu: పవన్ కళ్యాణ్ వీరమల్లు రన్ టైం ఎంతో తెలుసా?

Harihara Veeramallu: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా సోలో హీరోగా నటించిన వెండి తెరపై సందడి చేసిన సందర్భాలు లేవు అయితే తాజాగా ఈయన నటించిన హరిహర వీర మల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. నిజానికి ఈ సినిమా జూన్ 12వ తేదీ విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ జూలై 24వ తేదీ విడుదలకు సిద్ధమైంది.

ఇక ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాలు, ఇండియాలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏ సినిమాకు అయినా యూఎస్‌లో చాలా ముందు అడ్వాన్స్ బుకింగ్‌ మొదలు అవుతుంది. స్టార్‌ హీరోల సినిమాల యొక్క ముందస్తు బుకింగ్‌కి చాలా క్రేజ్ ఉంటుంది. ఇక ఈ సినిమాకు కూడా జులై 10వ తేదీ నుంచి అడ్వాన్స్ బుకింగ్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇంకా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోలేదు అయితే రన్ టైం గురించి ఒక వార్త బయటకు వచ్చింది.

ఈ సినిమా 2:40 నిమిషాల రన్ టైం ఉండబోతుందని తెలుస్తుంది.సాధారణంగా ఇలాంటి భారీ సినిమాలకు మూడు గంటల రన్‌ టైమ్‌ను ప్లాన్‌ చేస్తారు. కానీ మేకర్స్ తెలివిగా 20 నిమిషాలు తగ్గించారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిడివి తక్కువ ఉంటే రిస్క్ తక్కువ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై ఎన్నో అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాకు మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా తదుపరి ఈయన కొన్ని కారణాలవల్ల ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో, నిర్మాత ఏ.యం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గత మూడు సంవత్సరాలుగా ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటున్న నేపథ్యంలో బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోయిందని తెలుస్తోంది. ఇక ఇటీవల సినిమా ట్రైలర్ చూసిన అనంతరం పవన్ కళ్యాణ్ జ్యోతి కృష్ణ పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించినట్టు తెలుస్తుంది.