Hari Hara Veera Mallu: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలిసిందే. పవర్ స్టార్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో పాల్గొంటూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్. ఇకపోతే పవన్ కళ్యాణ్ నటించిన పిరియాడిక్ యాక్షన్ ఫిలిం హరిహర వీరమల్లు. ఈ సినిమా జూలై 24వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా అనేక కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది.
ఇటీవల జూన్ 12న విడుదల చేస్తామని మూవీ మేకర్స్ ప్రకటించినప్పటికీ కొన్ని అనుకోని కారణాలవల్ల విడుదల తేదీని జూలై 24కు వాయిదా వేశారు. అయితే ఈసారి మాత్రం విడుదల తేదీలో ఎలాంటి మార్పులు లేవని తెలుస్తోంది. విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది మూవీ మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ ను పొందింది. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు.
బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నర్గీస్ ఫఖ్రీ, నోరా ఫతేహి నటించారు. కీరవాణి సంగీతం సమాకూర్చారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ విడుదల అవ్వగా ఆ వీడియో సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. కాగా ఈ చిత్ర నిడివి 2 గంటల 42 నిమిషాలు. సినిమాకి ప్రధాన బలంగా నిలిచిన కథనాన్ని, భారీ విజువల్స్ సెన్సార్ బోర్డు సభ్యులు ప్రశంసించారు. జూలై 20న వైజాగ్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడానికి నిర్మాతలు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తారని భావిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతున్న హరి హర వీరమల్లు సినిమా అసలుసిసలైన పాన్ ఇండియన్ సినిమాటిక్ అనుభూతిని అందించబోతోంది. USAలో ఇప్పటికే ఈ చిత్రం అడ్వాన్స్ సేల్స్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది.
