Vastu Tips:సాధారణంగా ప్రతి ఒక్కరు ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరియాలని ఎన్నో రకాల పూజలు, వ్రతాలు చేస్తుంటారు. అదేవిధంగా కొందరు కొన్ని వాస్తు పద్ధతులను కూడా ఎంతో విశ్వసిస్తారు.ఈ క్రమంలోనే మన ఇంట్లో సిరి సంపదలు కలగడానికి కొన్ని రకాల వాస్తు పరిహారాలు పాటించడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని భావిస్తారు. ఈ క్రమంలోనే చాలామంది పటిక తో కొన్ని పరిహారాలు చేయడం వల్ల మన ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని భావిస్తారు. అయితే పటికతో ఇలా చేయటం వల్ల మన ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి.
మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా ఆర్థిక సమస్యలు వెంటాడిన, అధిక ఒత్తిడికి లోనైనప్పుడు శుక్రవారం పట్టికను తీసుకొని ఎరుపు రంగు గుడ్డలో కట్టి ప్రధాన ద్వారం లోపలి వైపు కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. దీంట్లో కుటుంబంలో ఏర్పడిన కలహాలు గొడవలు సమస్యలు సైతం తొలగిపోతాయి.అలాగే వ్యాపారం చేసే చోట ఇలా ఎరుపు రంగు వస్త్రంలో పటికను కట్టడం వల్ల వ్యాపారంలో పురోగతి, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది.
అలాగే పట్టికను ఒక గిన్నెలో వేసి మన ఇంట్లో ఒక మూల పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోవడమే కాకుండా ఏ విధమైనటువంటి చెడు దృష్టి కూడా మన ఇంటి పై పడదు. అలాగే ఇంటిలో వాస్తు దోషం ఉంటే వాస్తు దోషం తొలగి పోవడానికి పటికను ఒక ఒక గిన్నెలో వేసి దేవుని గదిలో ఉంచాలి.ఇలా దేవుడి గదిలో ఉంచడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు సైతం తొలగిపోతాయి.