Varalakshmi Sharath kumar: హనుమాన్ నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ పోస్టర్ రిలీజ్.. మామూలుగా లేదుగా..?

Varalakshmi Sharath kumar: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరో తేజా సజ్జ, హీరోయిన్ అమృత అయ్యర్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం హనుమాన్. ఈ సినిమాను కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో అంజనమ్మ పాత్రల్లో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

అందులో వరలక్ష్మి శరత్ కుమార్ ముస్తాబైన పెళ్లికూతురు గెటప్ లో కనిపిస్తోంది. ఒక చేతిలో కొబ్బరి బొండాల గుత్తి ఉంది. ఆ పోస్టర్ లో గంభీరంగా కనిపిస్తోంది. ఇక ఈ పోస్ట్ ని చూసిన వరలక్ష్మీ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పోస్టర్ సినీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా హిందీ తో పాటు దక్షిణాది అన్ని భాషల్లో రిలీజ్ కానుంది.