ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ పనితీరును ఉద్దేశిస్తూ అదే పనిగా విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్, అతని మంత్రి వర్గాన్ని టార్గెట్ చేసి హైదరాబాద్ లో తన ఇంట్లో ఉంటూనే కుతంత్రాలు పన్నుతున్నాడు. దేశంలో సంచలనం రేపిన విశాఖ గ్యాస్ దుర్ఘటనలో 12 మంది చనిపోయినా..వందలాది మంది ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో అచేధనంగా పడి ఉన్నా ప్రతిపక్ష నేతగా కనీసం పరామర్శకి కూడా వెళ్లలేదు. దీంతో అధికార పక్షం నేతలు చంద్రబాబు పై అదే తరహాలో తిరిగి మాటల దాడి చేసారు. అయితే చంద్రబాబు పరామర్శకి రాకపోవడానికి మరో కారణం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయింది.
బాబు హైదరాబాద్ నుంచి గడప దాటితే అక్కడ టీఆర్ ఎస్ ప్రభుత్వం గానీ..ఏపీకి చేరుకుంటే ఇక్కడ వైకాపా ప్రభుత్వం గానీ క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తారు? అన్న భయం కారణంగా ఇల్లు కదల్లేదని సెటైర్లు వినిపించాయి. ఇప్పటికీ ఆయన అందుకే ఇల్లు కదలకుండా కేవలం వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా తన పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారని ఆయన వ్యతిరేక వర్గం ఆరోపించింది. ఇంట్లో కూర్చొని మనవలతో టైంపాస్ చేస్తూ..స్నాక్స్ తీసుకుంటూ కాలం గడుపుతున్నాడని తీవ్ర స్థాయిలో వైకాపా నేతలు విమర్శించారు. తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి బాబు తీరుపై నిప్పులు చెరిగారు.
వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలీ కాన్ఫరెన్స్‌ల్లో ప్రగల్భాలు పలకడం కాదు. దమ్ముంటే బయటకొచ్చి మాట్లాడాలని ధ్వజమెత్తారు. ఇప్పుడు గనుక బయటకు రాకపోతే జీవితాంతం ఇంట్లోనే ఉండాలని…ఇక మీకు లైఫ్ లాంగ్ హోమ్ క్వారంటైన్ తప్పదని మండిపడ్డారు. ఇప్పటికే టీడీపీ పార్టీ సీనైపోయిందని…ప్రజల్లోకి వస్తే రాళ్లు రువ్వి బుద్ది చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పోతిరెడ్డి పాడు విషయంలో మీ వైఖరి ఎలా ఉందో ప్రజలకు ఇప్పటికే స్పష్టంగా అర్ధమైందని, ఇక చంద్రబాబు అండ్ కో పార్టీ షట్టర్ దించి ఇంట్లో కూర్చుంటే కనీసం పరువైనా మిగుల్తుందని విమర్శించారు.