GVMC Elections: ఇప్పటికిప్పుడు విశాఖలో ఎన్నికలు నిర్వహిస్తే.. ఏ పార్టీ గెలుస్తుందో చెప్పేశారు..!

gvmc opinion poll released

ఏపీలో ప్రస్తుతం అందరి చూపు గ్రేటర్ విశాఖ ఎన్నికల మీదనే. ఏపీలోనే పెద్ద నగరం. అక్కడి రాజకీయాలు కూడా ఏపీని శాసిస్తాయి. దీంతో విశాఖను గుప్పిట్లో పెట్టుకోవాలని అధికార పార్టీతో పాటు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. విశాఖ తమ గుప్పిట్లోకి రావాలంటే.. విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో గెలిసి తీరాల్సిందే. జీవీఎంసీ ఎన్నికల్లో గెలిచి విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటే తమ పార్టీ తిరిగి పుంజుకున్నట్టే అని.. అది వచ్చే ఎన్నికల వరకు ఎంతో ఊపునిస్తుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.

gvmc opinion poll released
gvmc opinion poll released

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి గెలుపు బావుటా ఎగురవేసిన వైసీపీ… గ్రేటర్ విశాఖ ఎన్నికల్లోనూ గెలిచి తమ సత్తా చూపించాలని తాపత్రయ పడుతోంది.

అయితే.. ఇప్పటికిప్పుడు… ఉన్నపళంగా విశాఖలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే ఏం జరుగుతుంది. ఏ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. అనే దానిపై సర్వే చేయగా.. దాంట్లో షాకింగ్ విషయాలు తెలిశాయి.

ఇప్పటికిప్పుడు విశాఖలో గ్రేటర్ ఎన్నికలు నిర్వహిస్తే.. వైఎస్సార్సీపీకి 49.8 శాతం ఓట్లు వస్తాయట. టీడీపీకి 36.5 శాతం ఓట్లు, బీజేపీకి 2.8 శాతం, కాంగ్రెస్ కు 1.7 శాతం, జనసేనకు 4.1 శాతం, ఇతరులు, స్వతంత్ర అభ్యర్థులకు 5.1 శాతం ఓట్లు వస్తాయని వీడీపీఏ సర్వేలో వెల్లడైంది.

గ్రేటర్ విశాఖలో ఉన్న మొత్తం 98 సీట్లలో 84 నుంచి 89 సీట్ల మధ్య వైసీపీ స్వీప్ చేస్తుందని… టీడీపీకి 8 నుంచి 14 సీట్లు వస్తాయని సర్వే తెలియజేసింది. మిగితా పార్టీలకు ఒక్క కార్పొరేటర్ సీటు కూడా దక్కడం కష్టమేనని సర్వేలో వెల్లడయినట్టు తెలిపింది. అంటే.. జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠం వైసీపీదే అన్నమాట.