జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భారీ కుంభకోణానికి పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది. దాదాపు 800 కోట్లకు పైగా దారి మళ్లించినట్లు సీబీఐ ఆరోపించింది. దీంతో ఆ సంస్థ అధినేతలు జి. వెంకటకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు ముంబై ఇంర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ సంజయ్ రెడ్డిలపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో మరో తొమ్మింది మంది ప్రయివేటు సంస్థల అధికారులు కూడా ఉన్నారు. 2012-18 మధ్య ప్రజా ఖజానాకు నష్టాన్ని కలిగించారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్- జీవీకే ఎయిర్ పోర్ట్ హోల్డ్సింగ్స్ జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేసింది.
దీనిలో భాగంగా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అభివృద్ధి నిర్వహణ కోసం మియాల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2017-18 లో తొమ్మిది కంపెనీలకు బోగస్ వర్క్ కాంట్రాక్ట్ లు చూపించి 310 కోట్లు దారి మళ్లించినట్లు సీబీఐ ఆరోపించింది. అలాగే జీవీకే గ్రూప్ కు ఆర్హిక సహాయం చేసేందుకు మియాల్ రిజర్వ్ ఫండ్ కింద 395 కోట్లు దుర్వినియోగానికి పాల్పడినట్లు ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రమోటర్ల ఫిర్యాదు ద్వారా 805 కోట్లు మొత్తంగా దారి మళ్లించినట్లు అభియోగాలు ఉండగా, అలాగే మియాల్ ఆదాయాన్ని కూడా తక్కువగా చూపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇలా మొత్తంగా అన్ని లెక్కలు తేల్చగా ప్రభుత్వ ఖజానాకు 1000 కోట్లకుపైగా నష్టం వాటిలిన్నట్లు సీబీబీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై లోతైన విచారణకు అధికారులు రంగం సిద్దం చేసారు. ఇప్పటికే కేసు కూడా ఫైల్ చేసినట్లు వెల్లడించారు. ఈ వార్త బయటకు రావడంతో జీవీకే పై నెటిజనులు భగ్గుమన్నారు. ప్రజదానాన్ని దుర్వినియోగం చేసారంటూ మండిపడ్డు తున్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లా జాబితాలో జీవీకే అధినేతల పేర్లు కూడా చేరతాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి వాళ్ల వల్లే భారత దేశం పేదరికంలో మగ్గిపోతుందంటూ మండిపడుతున్నారు.