మంత్రి కిషన్ రెడ్డికి గ్రేటర్ కష్టాలు తప్పేలా లేవు

minister kishan reddy

  తెలంగాణ బీజేపీలో అదృష్టం కలిగిన నేత ఎవరయ్యా అంటే అది కచ్చితంగా కిషన్ రెడ్డి అనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుండి బరిలో దిగి విజయం సాధించాడు. దీనితో ఏకంగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి పదవి దక్కించుకున్నాడు. ఆయన అదృష్టం చూసి పక్క పార్టీ నేతలు కూడా కుళ్ళుకున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి పెద్ద సమస్య వచ్చి పడింది.

kishan reddy telugu rajyam

  ఈ ఏడాది చివరిలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ లో బీజేపీ తన బలం చూపించాలన్న, 2023 ఎన్నికల నాటికీ పార్టీని బలోపేతం చేసుకోవాలన్న ఈ ఎన్నికలు చాలా కీలకం. కేంద్ర మంత్రి హోదాలో ఆ బాధ్యతను కిషన్ రెడ్డి భుజాల మీద వుంది. మరి ముఖ్యంగా సికింద్రాబాద్ పరిధిలోని డివిజన్స్ లో బీజేపీకి తన సత్తా చాటాలి. సికింద్రాబాద్ పరిధిలో ఒక్క స్థానంలో కూడా బీజేపీ కార్పొరేటర్ లేరు, హైదరాబాద్ మొత్తం మీద 150 స్థానాలు ఉంటే గత ఎన్నికల్లో బీజేపీ కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ సారి ఎలాగైనా ఎక్కువ సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.

   సికింద్రాబాద్ పరిధిలో అన్ని డివిజన్స్ అభ్యర్డుల విషయంలో కిషన్ రెడ్డి ఇప్పటికే ఒక సర్వే చేయించినట్లు తెలుస్తుంది. ఒక్కో డివిజన్ నుండి ఇద్దరుముగ్గురు చొప్పున లిస్ట్ తయారుచేపించి, అందులో ఎవరికీ గెలిచే అవకాశం ఉందని సర్వే లో తేలితే వాళ్ళను పోటీలో దించాలని చూస్తున్నాడు. అదే విధంగా బూత్ స్థాయి నేతలతో కూడా కిషన్ రెడ్డి మాట్లాడి, అక్కడ ఓటింగ్ విధానం గురించి, బీజేపీ అనుకూలతలు,ప్రతికూలతలు తెలుసుకొని దానికి తగ్గట్లు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ గ్రేటర్ ఎన్నికల్లో సరైన విజయం సాధిస్తే, కేవలం తెలంగాణలో మాత్రం కాకుండా ఢిల్లీ స్థాయిలో కిషన్ రెడ్డి కి మంచి పేరు వస్తుంది. ఏమైనా తేడా జరిగితే మాత్రం అదే స్థాయిలో ఇబ్బందులు కూడా తప్పవు. అందుకే కిషన్ రెడ్డి గ్రేటర్ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నట్లు అర్ధం అవుతుంది.