తెలంగాణ గవర్నర్ తమిళి సై ప్రవర్తన కాంగ్రెస్ నేతలకు ఒక పట్టాన అర్ధం కావటం లేదు. గతంలో కరోనా విషయంలో ఏకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై జాతీయ స్థాయి మీడియాలో విమర్శలు చేసిన ఆమె, ఇప్పుడు అదే విషయంలో ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు కురిపిస్తుంది, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి చురకలే వేస్తుంది. కొద్ది రోజుల కిందట వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ… కాంగ్రెస్ నేతలు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు. కానీ రాజ్‌భవన్ ఇవ్వలేదు.
కరోనా కారణంగా ఎవరికీ అపాయింట్‌మెంట్లు ఇవ్వడం లేదని రాజ్‌భవన్ వర్గాలు సమాచారం ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఎవరెవర్ని కలిశారో వివరిస్తూ.. గవర్నర్ తీరుపై మండిపడ్డారు. రెండు, మూడు రోజులు ఈ విమర్శల్ని పట్టించుకోని గవర్నర్ తమిళిసై హఠాత్తుగా కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయాలు చేయటానికి మాత్రమే వచ్చారని, డ్రామాలు ఆడటానికి రాజభవన్ వేదిక కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు తమిళిసై. గతంలో నరసింహన్ కూడా ఇదే రీతిలో ప్రభుత్వం తరుపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడిన సందర్భాలు అనేకం వున్నాయి, ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు కలవటానికి అవకాశం ఇచ్చి, ఆ తర్వాత డైరెక్ట్ గా వాళ్లనే విమర్శించేవాడు నరసింహన్ , ఇప్పుడు తమిళిసై కనీసం వాళ్ళకి కలిసే అవకాశం కూడా ఇవ్వకుండా విమర్శలు చేయటం విశేషం.
నిజానికి రాజభవన్ పాత్ర పరిపాలనలో కేవలం నామమాత్రమే, రాజకీయ పరమైన విషయాల్లో గవర్నర్ కి ఎలాంటి పిర్యాదులు చేసిన కానీ వచ్చే లాభమేమి లేదు, ఆ విషయం అందరికి తెలిసిన మళ్ళీ మళ్ళీ వెళ్లి గవర్నర్ కి పిర్యాదు చేస్తున్నారు, అందులో రాజకీయం తప్ప మరో కోణం లేదు, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, గతంలో బీజేపీ, తెరాస పార్టీలు ఇలాంటి పనులు చేసిన వాళ్లే , ఇవన్నీ తెలిసి కూడా గవర్నర్ కాంగ్రెస్ నేతలకు డ్రామాలు ఆడవద్దంటూ హెచ్చరించటం ఇప్పుడు హాట్ హాట్ టాపిక్ అయ్యింది. మొదటిలో సీఎం కెసిఆర్ కు చెక్ పెట్టటానికి తమిళిసై ని తెలంగాణ గవర్నర్ గా నియమంచారని అనుకున్నారు, మొన్నటి కరోనా సమయంలో ఆమెకు కెసిఆర్ కు మధ్య విభేదాలు కూడా వచ్చాయి. దీనితో గవర్నర్ కి, సీఎం కెసిఆర్ కి రాజకీయం వైరం తప్పదనుకున్నారు, కానీ ఇంతలోనే ఆమె స్వరం మార్చటం వెనుక అసలు కారణమేమిటో ఎవరికీ అంటూ చిక్కటం లేదు