Goutham: ఒంటరితనం భయంకరం : హీరో గౌతమ్

Goutham: టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గౌతమ్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు సుబ్బు చెరుకూరి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ ని విడుదల చేశారు.

ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా, అన్న డైలాగుతో గౌతమ్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో గౌతమ్ మోనోఫోబియా సమస్యతో బాధపడుతున్న రచయిత పాత్రల్లో కనిపిస్తాడు. ఒక ప్రమాదం అతని జీవితాన్ని ఎలా మార్చింది? అతని ఎదుర్కొంటున్న సమస్య మరొక పెద్ద సమస్యకు కారణమైతే దాన్ని అతను ఎలా అధిగమించాడు అన్న కథా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు చిత్రబృందం.