సినీ ఇండస్ట్రీ నుండి ఇప్పటికే చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నందమూరి తారకరామారావు నుండి నిన్నటి చిరంజీవి ఇప్పటి పవన్ వరకు సినిమాల నుండి వచ్చినవారే. అయితే ఎన్టీఆర్ చూపినంత ప్రభావాన్ని మరో హీరో చూపలేకపోయారు. భారీ స్టార్ డమ్ ఉన్న పవన్ సైతం మొన్నటి ఎన్నికల్లో మట్టికరవాల్సి వచ్చింది. దీంతో ఇక సినిమా హీరోలకు రాజకీయాల్లో భవిష్యత్తు లేదని అందరూ అనుకుంటున్నారు. కానీ ఒక వ్యక్తి విషయంలో మాత్రం అలా అనుకోవడానికి లేదు. అతనే జూ. ఎన్టీఆర్. ఎప్పటికైనా ఆయన రాజకీయాల్లోకి వచ్చి తీరుతారనే ధీమాతో ఉన్నారు నందమూరి అభిమానులు.
2009 ఎన్నికల్లో చంద్రబబు నాయుడు పిలుపు మేరకు ప్రచార భాద్యతలను భుజానికెత్తుకున్న చిన్న రాముడు బాగానే పనిచేశారు. కానీ పార్టీ ఓడిపోవడం, కొందరి కుట్రలు కారణంగా ఆయన పనితనం హైలెట్ కాలేదు. కానీ టీడీపీ శ్రేణులకు మాత్రం ఎన్నికల ప్రచారంలో తారక్ జనాకర్షణ ఎలాంటిదో తెలిసొచ్చింది. అప్పటి నుండి ఆయన పూర్తి స్థాయిలో పార్టీలోకి వస్తే బాగుంటుందనే అభిప్రాయం బలపడింది. కానీ చంద్రబాబు, లోకేష్, వారికి వత్తాసు పలికే బాలకృష్ణ మూలన అది కలగానే మిగిలిపోయింది. అయితే ఎన్టీఆర్ మనసులో కూడా ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఉందని ఆయను దగ్గరి నుండి చూసిన వారు అంటున్నారు.
ప్రజెంట్ ఆయన ఆ పనుల్లోనే ఉన్నారని టాక్. తారక్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలను సంఘటితం చేసుకుంటూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నారని టాక్. అందులో మొదటి అడుగుగా బ్లెడ్ బ్యాంక్స్ స్థాపించాలని అనుకుంటున్నారట. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలైందని చెప్పుకుంటున్నారు. అదే నిజమై తారక్ సేవా కార్యక్రమాలతో ప్రజాక్షేత్రంలోకి దూకితే మాత్రం ఆయనకు పెద్ద ఎత్తున ప్రజల మద్దతు లభించడం ఖాయం. ఆ మద్దతుతో ఆయన పార్టీ గనుక పెడితే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతాడనడంలో ఏమాత్రం సందేహం లేదు.