Bheemla Nayak Ott : గాసిప్స్ : అప్పుడే “భీమ్లా నాయక్” ఓటిటి రిలీజ్ కి డేట్ కన్ఫర్మ్ అయ్యిందా?

Bheemla Nayak Ott : టాలీవుడ్ లో వచ్చిన లేటెస్ట్ మరియు ఇంట్రెస్టింగ్ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లాంటి ఇద్దరు డైనమిక్ హీరోలతో దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించిన చిత్రం “భీమ్లా నాయక్”.
తెలుగులో సాలిడ్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు హిందీలో కూడా రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది. మరి ఇదిలా ఉండగా ఈ మాస్ ఎంటెర్టైనర్ విజయవంతంగా మొదటి వారాన్ని పూర్తి చేసుకోగా అప్పుడే ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సంబంధించి గాసిప్స్ వినిపిస్తున్నాయి.
మరి ఈ సినిమా తాలూకా ఓటిటి హక్కులని ప్రముఖ స్ట్రీమింగ్ యాప్స్ ఆహా మరియు హాట్ స్టార్ వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వీరి నుంచి ఈ సినిమా ఈ మార్చ్ లోనే స్ట్రీమింగ్ కి వచ్చేస్తుందని ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. అంటే సినిమా రిలీజ్ అయ్యిన నెల రోజులకే ఓటిటి లో వచ్చేస్తున్నట్టు అని చెప్పాలి.
మరి దీనిపై సరైన క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో నిత్య మీనన్ మరియు యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ మంచి డెబ్యూ తో మంచి స్టార్ట్ ని అందుకుంది. అలాగే థమన్ ఈ సినిమాకి సంగీతం అందివ్వగా నాగవంశీ నిర్మాణం వహించారు.