జస్ట్ ఈ రెండు రోజులు నుంచి కూడా పాన్ ఇండియా వైడ్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “ఆదిపురుష్” కోసమే మంచి హాట్ టాపిక్ గా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఇక ఈ చిత్రం అయితే అనుకున్న రేంజ్ అంచనాలు సినిమా టీజర్ తర్వాత తెచ్చుకోలేకపోయింది అనే మాట వాస్తవం.
అయినా కూడా కొన్నాళ్ళు వరకు మేకర్స్ సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు లేదని జనవరి 12 వస్తుందని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా సినిమా వాయిదా అనే మాట ఊపందుకోగా ఇప్పుడు దీనితో పాటుగా మరో ఇంట్రెస్టింగ్ సమాచారం బాలీవుడ్ మీడియా నుంచి వినిపిస్తుంది.
ఇప్పుడు ఈ సినిమా కోసం మళ్ళీ మేకర్స్ అదనంగా 100 కోట్లు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఎందుకంటే సినిమాలో గ్రాఫిక్స్ కోసం కేటాయించినట్టు తెలుస్తుంది. మరి ఇదొక్కటే కాకుండా మళ్ళీ ప్రభాస్ మరియు స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ల పై రీ షూట్ లు కూడా ఉండొచ్చని అంటున్నారు.
మొత్తానికి అయితే ప్రభాస్ తో మాత్రం వారు ఏదేదో చేస్తున్నారు. ఇప్పటికే అసలు ఇది 500 కోట్ల బడ్జెట్ సినిమాలా లేనే లేదు.. మళ్ళీ 100 కోట్లు పెట్టి ఏం చేస్తారో ఏంటో అని అభిమానులు అనుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఆదిపురుష్ పై ఈ అప్డేట్ తెలిసింది.