Rashmika : రష్మిక, సోషల్ మీడియా కోసం అంతలా ఖర్చు చేస్తోందా.?

Rashmika :  చాలా తక్కువ సినిమాలతో నేషనల్ క్రష్ అయ్యింది రష్మిక మండన్న. ఆమె అందుకుంటున్న హిట్లు అలాంటివి మరి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినీ పరిశ్రమల్లో చాలా బిజీగా వుందిప్పడు రష్మిక. అయితే, రష్మిక ఇంతలా పాపులర్ అవడానికి మరో కారణం కూడా వుంది. అదే సోషల్ మీడియా.

ఏ నటికీ లేనంత స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ రష్మికకి చాలా తక్కువ కాలంలోనే వచ్చేసింది. రష్మిక మీద ఈగ వాలనివ్వరు ఆమె అభిమానులు. రష్మిక మీద ఎవరన్నా ట్రోల్ చేస్తే, రష్మిక అభిమానులు విరుచుకుపడిపోతారు. రష్మికని దేవతతో పోల్చుతారు. రష్మిక సేవా కార్యక్రమాల గురించి తెలిసిందనీ, తెలియనిదీ చెప్పేస్తారు.

అసలు ఇంతలా రష్మికకి సోషల్ మీడియాలో అంత బలమైన ఫాలోవర్స్ ఎలా వచ్చారట.? ఈ విషయమై చాలా చాలా వాదనలున్నాయి. అందులో ఒకటి, రష్మిక సోషల్ మీడియా కోసం చాలా ఖర్చు చేస్తోందనీ, రష్మికకి మద్దతిచ్చేవారంతా పెయిడ్ బ్యాచ్ అనేది.

నిజమేనా.? అని ఆరా తీస్తే, చాలామంది సెలబ్రిటీలు తమ అభిమానుల్ని రకరకాల మార్గాల్లో ఎంకరేజ్ చేస్తుంటారు. ప్రత్యేకంగా పీఆర్‌లను పెట్టుకుని అభిమాన సంఘాల్ని మెయిన్‌టెయిన్ చేస్తుంటారు. రష్మిక కూడా అలా చేస్తుండొచ్చు. అందుకోసం రష్మిక కొంత ఖర్చు చేసినా చేస్తుండొచ్చు.

కానీ, ఎవరి విషయంలోనూ ఇలా ‘అనూహ్యమైన రీతిలో ఖర్చు చేస్తోంది..’ అన్న గాసిప్స్ అయితే బయటకు రాలేదు. నిప్పు లేకుండా పొగ రాదు కదా.? రష్మిక నిజంగానే పెద్దమొత్తంలో సోషల్ మీడియా కోసం ఖర్చు చేస్తోందని అనుకోవాలా.?