తెలంగాణ ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేస్తోంది. తాజాగా ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈనేపథ్యంలో.. ప్రముఖ కవి, వాగ్గేయకారుడు అయిన గోరేటి వెంకన్నకు ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఆయనతో పాటు… మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ కు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చింది ప్రభుత్వం. ఈ ముగ్గురి పేర్లను తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపించింది. గవర్నర్ ఆమోదం రాగానే… శనివారమే ఈ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.