గోపిచంద్ బర్త్ డే ట్రీట్ అదిరింది

Gopichand's Pakka Commercial look impressed fans
Gopichand's Pakka Commercial look impressed fans
మ్యాచో మ్యాన్ గోపిచంద్ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న రెండు కొత్త సినిమాల నుండి కొత్త లుక్స్ విడుదలయ్యాయి. మారుతి దర్శకత్వంలో గోపిచంద్ చేస్తున్న ‘పక్కా కమర్షియల్’ చిత్రం నుండి లుక్ వదిలారు. ఇందులో గోపిచంద్ చాలా క్లాసీగా కనిపిస్తున్నాడు.  స్టైలిష్ ఫార్మల్ డ్రెస్ వేసి క్యాచింగ్ స్మైల్ తో అల్ట్రా పోష్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు.  ఫ్యాన్స్ అయితే లుక్ పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.  
 
మారుతి సినిమాల్లో హీరోలు అందంగానే ఉంటారు.  ఇక ఈ లుక్ చూసాక గోపీచంద్ మరింత అందంగా కనిపిస్తాడనే నమ్మకం కలుగుతోంది. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా కథానాయకిగా నటిస్తోంది. ఇందులో గోపీచంద్ ఒక లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ మూలంగా ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. మొదలవ్వడానికి ఇంకాస్త టైం పట్టేలా ఉంది. గోపీచంద్ సంపత్ నంది దర్సకత్వంలో ‘సీటిమార్’ చిత్రం చేస్తున్నారు.  ఇంకొద్దిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది.  త్వరలోనే చిత్రీకరణ రీస్టార్ట్ కానుంది.