తన కెరీర్ లోనే బెస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో బయటపెట్టేసిన గోపీచంద్!

గోపీచంద్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న ప్రముఖ హీరోలలో ఒకరు. తెలుగు చలనచిత్ర దర్శకుడు టి. కృష్ణ రెండవ కుమారుడు.
గోపీచంద్ మొదట వ్యాపార రంగంలో అడుగు పెట్టాలి అనుకున్నాడు. కానీ తన అన్న ప్రేమ్ చంద్ దర్శకుడు కావాలని సినీ రంగంలో ప్రవేశించిన కొంత కాలానికి ఒక ప్రమాదంలో మరణించాడు. తండ్రి వారసత్వంగా ఎవరో ఒకరు సినీ రంగంలో ఉండాలనే ఉద్దేశంతో గోపీచంద్ సినిమా రంగంలోకి రావడం జరిగింది.

2001లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన తొలివలపు చిత్రం ద్వారా హీరోగా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. తరువాత జయం, నిజం, వర్షం వంటి విజయవంతమైన చిత్రాలలో విలన్ పాత్రను పోషించి మంచి గుర్తింపు పొందిన తర్వాత హీరోగా అవకాశాలు రావడం జరిగింది. రణం, యజ్ఞం, శౌర్యం, లౌక్యం, లక్ష్యం, శంఖం వంటి సినిమాలు మంచి విజయాలను సాధించి హీరోగా నిలవదుక్కుకునే విధంగా చేశాయి. ఒకరకంగా ఈ సినిమాలే అతనికి టర్నింగ్ పాయింట్, ఇలా కామెడీ ఇంకా కుటుంబ కథ చిత్రాలను తీస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. గోపీచంద్, హీరో శ్రీకాంత్ మేనకోడలు అయిన రేష్మను వివాహం చేసుకున్నాడు.

అసలు విషయానికి వస్తే గోపీచంద్, జయం సినిమాలో విలన్ గా చేసి 11 వేల రూపాయలను రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్టు ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇటీవలే మారుతి దర్శకత్వం వహించిన పక్కా కమర్షియల్ సినిమా మంచి యాక్షన్, కామెడీ, కావలసినంత ఫన్ ఉండడంతో ప్రేక్షకులను ఎంతో బాగా ఆకట్టుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షలను వసూలు చేసి పెట్టింది. ఒక మీడియా సమావేశంలో తన కెరీర్ లో నే బెస్ట్ రెమ్యూనరేషన్ ఈ సినిమాకే తీసుకున్నట్టు తన మనసులోని మాట బయటపెట్టేశాడు గోపీచంద్. ఇలా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు.