Gopichand: జయం సినిమాలో విలన్ పాత్రలో నటించి అందరిని మెప్పించిన గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తర్వాత వర్షం వంటి సూపర్ హిట్ సినిమాలో కూడా గోపీచంద్ విలన్ గా నటించాడు. విలన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన గోపీచంద్ తర్వాత హీరోగా ఎన్నో సినిమాలలో నటించాడు. గోపీచంద్ నటించిన రణం, లక్ష్యం, గోలీమార్, లౌక్యం వంటి ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇలా గోపిచంద్ హీరోగా మాత్రమే కాకుండ విలన్ గా కూడా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. గోపిచంద్ ఇప్పటివరకు ఇండస్ట్రీస్ లో తన పని తాను చేసుకుపోతూ కాంట్రవర్సీ లకు దూరంగా ఉంటున్నాడు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో గోపిచంద్ కి జోడీగా రాశి ఖన్నా నటించింది. ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రలో ప్రేక్షకులని అలరించనున్నారు. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహించాడు. ఈ సినిమ జూలై 1 వ తేదీన విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఈ సినిమా విడుదలైన టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమా విశేషాల గురించి పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన మొదటి సినిమాకి రెమ్యూనరేషన్ ఎంత అని యాంకర్ అడిగిన ప్రశ్నకు గోపీచంద్ సమాధానం ఇచ్చాడు. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన జయం సినిమాలో గోపీచంద్ విలన్ పాత్రలో నటించాడు. గోపీచంద్ నటించిన మొట్ట మొదటి సినిమా కూడా ఇదే. అయితే ఈ సినిమాలో గోపీచంద్ రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. జయం సినిమాలో విలన్ పాత్రలో నటించినందుకు డైరెక్టర్ తేజ గారు ఆయకి 11 వేల రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చారట. అయితే ఆ 11 వేల పక్కన ఇంకో సున్నా ఉంటే బాగుండేది అనుకున్నాను అంటూ గోపిచంద్ తన మొదటి సినిమా రెమ్యూనరేషన్ గురించి చెప్పుకొచ్చాడు.