గోపీచంద్ ముక్కు కోసేసిన సోదరుడు.. రక్తంతో తడిచిపోయిన అన్నం?

జయం సినిమా ద్వారా విలన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు గోపీచంద్. మొదట విలన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు. యజ్ఞం, రణం, లక్ష్యం వంటి సినిమాల ద్వార హీరోగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. హిట్,ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తు ఇండస్ట్రీలో తన హవా కొనసాగిస్తున్నాడు. ఇటీవల గోపీచంద్ నటించిన “పక్కా కమర్షియల్” సినిమా విడుదలకి సిద్దంగా ఉంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో ఇటీవల ఆలీతో సరదాగా షో లో పాల్గొని సినిమా విశేషాలతో పాటు తన చిన్నప్పటి విషయాలను గురించి కూడా ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో గోపీచంద్ మాట్లాడుతూ..తన సోదరుడు చిన్నప్పుడు తన ముక్కు బ్లేడ్ తో కోసేసాడని.. ఆ సమయంలో పెరుగన్నం తింటున్నా. రక్తం కారీ మొత్తం అన్నం అంతా రక్తంతో ఎర్రగా మారిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక చిన్నప్పుడే తన తండ్రి మరణించాడని.. ఆ వయసులోనే జీవితం చాలా నేర్పింది అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇలా ఈ షో ద్వారా గోపీచంద్ ఎన్నో ఆసక్తికర విషయాలు గురించి చెప్పుకొచ్చాడు.

ఇక ప్రస్తుతం గోపిచంద్ “పక్కా కమర్షియల్” సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. గోపిచంద్ నటిస్తున్న ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచింది. ఇటీవల గోపీచంద్ నటించిన “సీటీమార్” సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ గోపిచంద్ మాత్రం కి కమర్షియల్ హిట్ కాలేకపోయింది. అందుకే ప్రస్తుతం గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. మరి ఈ సినిమా కూడా గోపిచంద్ కెరీర్ లో హిట్ గా నిలుస్తుందో.. లేదో.. చూడాలి మరి.