ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన (ఎస్బిఐ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే తన కస్టమర్లకు వివిధ రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చి ఎన్నో సేవలు అందిస్తోంది. ఈ స్కీమ్స్ ద్వారా ఎస్బిఐ కస్టమర్లు అనేక లాభాలు పొందుతున్నారు. తాజాగా ఎస్బిఐ మరొక సరికొత్త స్కీం ని తీసుకువచ్చింది. ఈ స్కీం ద్వారా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు పిల్లల పెళ్లి సమయానికి నిశ్చింతగా ఉండే అవకాశాన్ని కల్పిస్తుంది. ఎస్బిఐ అందిస్తున్న ఈ స్కీం ద్వారా మీ కుమార్తె చదువు, వివాహానికి బ్యాంకు నుండి రూ.15 లక్షలు పొందవచ్చు. ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడితే భవిష్యత్ లో మరింత లాభం పొందవచ్చు.
ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రవేశపెట్టింది. అయితే ఈ సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టడానికి కస్టమర్‌లను సులభతరం చేస్తున్న ఇతర బ్యాంకులతో సహా మీరు 1.5 లక్షల వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో పెట్టుబడి పెట్టవచ్చు. సుకన్య సమృద్ధి ఖాతాలో మీరు సంవత్సరానికి రూ. 250 ఇన్వెష్ట్ చేయవచ్చు. లేదా సంవత్సరానికి గరిష్టంగా 1.5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఒకేసారి అధిక మొత్తంలో డబ్బు ఇన్వెస్ట్ చేయలేని వారు ప్రతినెల రూ. 250 50 రూపాయలు చొప్పున ఎస్బిఐలో సుకన్య సమృద్ధి పథకంలో డబ్బు ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఇలా ఎస్బిఐ లో సుకన్య సమృద్ధి స్కీం కింద ఇన్వెస్ట్ చేయడం వల్ల 80 శాతం పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా లభిస్తుంది. ముఖ్యంగా బాలికల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ పథకాన్ని ఎంతోమంది సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పథకం కింద ఇద్దరు ఆడపిల్లలకు ఖాతా తెరవవచ్చు. ఇలా ఇద్దరికే కాకుండా ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న సుకన్య సమృద్ధి యోజనకు 7.6 శాతం వడ్డీ లభిస్తోంది. ఇది కాకుండా మొదటి కుమార్తె పుట్టిన తర్వాత ఇద్దరు కవల కుమార్తెలు ఉన్నట్లయితే, ఈ సందర్భంలో ముగ్గురు కుమార్తెలు కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని పొందె అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.