Ambati Rambabu : అంబటిని వరించిన అదృష్టం: కారణం ఇదేనా.?

Ambati Rambabu :  వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుని అదృష్టం వరించింది. అదే మంత్రి పదవి.! తొలి మంత్రి వర్గంలోనే అంబటికి చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు. ఆయన వాగ్ధాటి అలాంటిది.

తొలి మంత్రి వర్గంలో చోటు దక్కకపోయేసరికి అంబటి ఒకింత అసహనానికి గురయ్యారు.. కానీ, తొందరగానే సర్దుకున్నారు.

అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఎవరన్నా విమర్శలు చేస్తే తనదైన స్టయిల్లో చెలరేగిపోయారు.

అసలు అంబటి రాంబాబుకి మంత్రి పదవి రావడానికి కారణమేంటి.? అంటే, పవన్ కళ్యాణ్.. అనే చర్చ జరుగుతోంది. పదే పదే అంబటి రాంబాబుని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తుంటారు. నిజానికి, పవన్ కళ్యాణ్ పేరు వాడుకుని 2019 ఎన్నికల్లో అంబటి రాంబాబు గెలిచారనే వాదన కూడా వుంది.

సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అభిమానుల్ని అంబటి బతిమాలుకున్నారు.

‘గెలవకపోతే నా రాజకీయ జీవితం ముగిసిపోతుంది..’ అంటూ కంటతడి పెట్టుకున్నారని పవన్ అభిమానులు చెబుతుంటారు. సరే, అదెంత నిజం.? అన్నది వేరే చర్చ.

అంబటికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా, ఓ బలమైన సామాజిక వర్గానికి బలమైన సంకేతాన్ని వైఎస్ జగన్ పంపారనే ప్రచారం జరుగుతోంది.

సరే, తెరవెనుక కారణాలు ఏవైనా వుండొచ్చు.. అంబటి రాంబాబు తాను కలగన్న మంత్రి పదవిలో కూర్చోబోతున్నారు. ఎమ్మెల్యేగానే ముఖ్యమంత్రికి అత్యంత విశ్వాసపాత్రుడిగా వున్న అంబటి, మంత్రి అయ్యాక.. ఆ విశ్వాసాన్ని పదింతలు చూపిస్తారన్నది నిర్వివాదాంశం.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుల్లో ఒకరిగా అంబటి గురించి చెబుతుంటారు. అలా విశ్వాసానికి తగిన గుర్తింపు.. అంటూ అంబటికి దక్కిన పదవి గురించి వ్యాఖ్యానిస్తున్నారు ఆయన అభిమానులు.