Gold Silver Price : పెరిగిన బంగారం, వెండి ధరలు..

gold

బంగారం ధర పెరిగింది. గత కొద్ది రోజులుగా నిలకడగా కొనసాగుతున్న పసిడి రేటు ఈరోజు పెరిగింది. వెండి దర కూడా ఇదే దారిలో పయనించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర పెరిగింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగింది. ప్రస్తుత రేటు రూ. 51,700కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 పెరిగి రూ. 47,400 వద్ద ఉంది. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. కేజీపై రూ.300 పెరిగింది. ప్రస్తుతం సిల్వర్ రేటు రూ. 72,600గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో ఇదే రేట్లు కొనసాగుతున్నాయి.