కొన్ని సినిమాల్లో అవకాశం ఉందని చెప్పి, అడ్వాన్స్ తీసుకున్నాక కూడా వేషం లేదని చెప్పారని సీరియల్ నటుడు శ్రీకృష్ణ కౌశిక్ అన్నారు. నిజంగా అసలు ఏంటీ ప్రాబ్లం, తన ప్రయత్న లోపమా, లేదంటే అప్రోచ్ అయ్యే విధానంలో లోపముందా , లేదంటే దానికేమన్నా ఆల్టర్‌నేట్ ఉంటుందా, లేదంటే వేరే విధంగా ఏమైనా అప్రోచ్ కావాలా అని తనకు తెలియదని ఆయన అన్నారు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా తాను ఇండస్ట్రీలో ఉన్నానని, తనకు చాలా మందితో పరిచయం ఉందని తన పేరు తెలియకపోయినా చాలా మంది తన ముఖం చూడగానే గుర్తు పడతారని ఆయన అన్నారు. కానీ సినిమా స్టార్ట్ అయ్యాక కలవాలా, కథ రాసుకునే ముందే కలవాలా, తర్వాత కలవాలా తనకు అర్థం కావడం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
మామూలుగా అయితే ఆఫీస్ ఓపెన్ చేయగానే సినిమా రేపు స్టార్ట్ అవుతుంది అనంగా వెళ్లి కలుస్తారు ఎవరైనా అయితే. కామన్ గా అయితే ఇలానే అవుతుందని ఆయన అన్నారు. కానీ తాను మాత్రం అప్పుడు కలిశాను, ఆ తర్వాత కలిశాను.. కానీ వర్కవుట్ కాలేదని శ్రీకృష్ణ కౌశిక్ అన్నారు. కొన్ని సినిమాల్లో అయితే బాగా చేస్తున్నావు అని వద్దన్నారని ఆయన అన్నారు. ఇది కూడా తన బ్యాడ్ లక్కేనా అని తాను అనుకున్నానని కృష్ణ కౌశిక్ చెప్పారు. బాగా చేయడం అంటే కూడా తప్పే అంటే ఇంకా తనేం చేయగలను అని ఆయన వివరించారు.