జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక నేడు జరగనుంది. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్‌లను గురువారం ఎన్నుకోనున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించడంతో ఎన్నిక నిర్వహణ అనివార్యం కానుంది. ఈ ఎన్నిలకు బీజేపీ సమాయత్తం అయ్యింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది.
ఈ క్రమంలోనే బీజేపీ కార్పొరేటర్లు బుధవారం ఉదయం బషీర్‌బాగ్‌లోని కనకదుర్గ, నాగలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీజేపీ కార్పొరేటర్లు ఆలయంలో ప్రతిజ్ఞ చేశారు. మరికాసేపట్లో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను బీజేపీ అధికారికంగా ప్రకటించనుంది. కాగా.. బీజేపీ మేయర్ అభ్యర్థిగా రాధా ధీరజ్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే ఫ్లోర్ లీడర్ పదవి కోసం బీజేపీ కార్పొరేటర్లు పోటీపడుతున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందాయి. ఎక్స్ అఫిషియో బలాబలాలు చూస్తే టీఆర్ఎస్ 32, ఎంఐఎం 10, బీజేపీ 02.