GHMC ఎలక్షన్ ముందు తెలంగాణలో ఊహించని పరిణామం..!

ghmc elections 2020 in telangana

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. దీని వల్ల అన్ని దేశాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాయి. ఇప్పటికీ ఎదుర్కొంటున్నాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కరోనా వల్ల చిన్నాభిన్నం అయింది. విద్యాసంస్థలు మూత పడ్డాయి. అన్ లాక్ 4.0 లో భాగంగా.. విద్యాసంస్థలను కొన్ని రాష్ట్రాల్లో తెరిచినప్పటికీ.. తెలంగాణలో మాత్రం తెరవలేదు. ఇప్పటికీ ఆన్ లైన్ లోనే విద్యాబోధన జరుగుతోంది.

ghmc elections 2020 in telangana
ghmc elections 2020 in telangana

దీని వల్ల ప్రభుత్వ టీచర్ల ఖాళీగానే ఉంటున్నారు. విద్యాసంస్థలు తెరవకపోవడంతో వాళ్లకు పెద్దగా పని కూడా ఏం లేదు. అయితే.. ఈ సమయంలోనే గ్రేటర్ ఎన్నికలు రావడంతో… పరిస్థితి భిన్నంగా మారింది.

నిజానికి.. ఏ ఎన్నికలైనా సరే.. టీచర్ల పాత్ర మరువలేనిది. ఎన్నికలను దగ్గరుండి చూసుకునేది ఉపాధ్యాయులే. కానీ.. ఈసారి ఉపాధ్యాయులు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొనడం లేదట.

విద్యాసంస్థలు తెరవక వాళ్లు ఖాళీగానే ఉంటున్నప్పటికీ.. ఎన్నికల సంఘం ఉపాధ్యాయులకు ఎన్నికల బాధ్యతను అప్పగించడం లేదు అనే వార్తలు వస్తున్నాయి. అయితే.. దీనిపై పలురకాల ప్రచారాలు కూడా జోరుగా సాగుతున్నాయి.

ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుండటం… అందులోనూ ఎన్నికల సిబ్బంది పాత్ర కూడా చాలా కీలకం అవడం వల్ల.. ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు అప్పగిస్తే… వాళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్ వేయించే అవకాశం ఉందట. ఎందుకంటే.. పాఠశాలలు తెరవక.. ఇతర కారణాల వల్ల ప్రభుత్వం ఉపాధ్యాయులు ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. దాన్ని వాళ్లు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉపయోగించుకుంటారేమో అన్న సందేహంతో ప్రభుత్వమే వారిని దూరంగా ఉంచాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఎన్నికల కమిషన్ కూడా వాళ్లను దూరం పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి.

అయితే.. తమకు ఎందుకు ఎన్నికల విధులు అప్పగించడం లేదంటూ.. ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నాయట. మరి.. దానిపై ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ఎటువంటి సమాధానం చెబుతుందో మరి?