Junior: కిరీటి రెడ్డి జూనియర్ మూవీ ట్రైలర్ రిలీజ్.. హిట్ గ్యారంటీ.. అంచనాలు పెంచేస్తున్న వీడియో!

Junior: గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ జూనియర్. ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటిరెడ్డి. వారాహి చలనచిత్ర బ్యానర్ పై రజిని కొర్రపాటి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కిరీటి రెడ్డి సరసన శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. అలాగే స్టార్ హీరోయిన్ జెనీలియా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఒక పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ పాట యూట్యూబ్లో సెన్సేషన్ ను సృష్టిస్తోంది. ఈ పాటకు శ్రీ లీలా అలాగే హీరో కిరీటి రెడ్డి ఇద్దరూ కూడా స్టెప్పులను ఇరగదీసారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల అయ్యింది. కానీ అనేక కారణాలవల్ల సాగుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా జులై 18న విడుదల చేయబోతున్నారు మూవీ మేకర్స్. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు మూవీ మేకర్స్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Junior Trailer - Telugu | Kireeti | Ravi Chandran | Genelia | Sreeleela | Radha Krishna | DSP

ఈ ట్రైలర్ వీడియో ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ట్రైలర్ వీడియోని చూసిన అభిమానులు సినిమా హిట్ అవ్వడం గ్యారెంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల అయినా పాటలు ట్రైలర్ పోస్టర్లు సినిమాపై అంజనాలను భారీగా పెంచేశాయి. మరొక ఆరు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరిటి మొదటి సినిమాతో ఏ మేరకు సక్సెస్ ని అందుకుంటారో చూడాలి మరి.